Political

ఉద్యోగార్థులు ప్రాంతీయ గ్రంథాలయం సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్‌లను వెలువరించనున్న నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌ కాలనీలో గల ప్రాంతీయ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన ప్రాంతీయ గ్రంథాలయాన్ని సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. లైబ్రరీలో సరిపడా ఫర్నిచర్‌, …

Read More »

సారంగపూర్‌ క్యాంపస్‌ అకడమిక్‌ కో – ఆర్డినేటర్‌గా సువర్చల

డిచ్‌పల్లి, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సారంగపూర్‌ క్యాంపస్‌లో గల కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌కు అకడమిక్‌ కో – ఆర్డినేటర్‌ గా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్‌) ఎ. సువర్చల నియామకం పొందారు. కాగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ చేతుల మీదుగా ఆయన చాంబర్‌లో బుధవారం నియామక పత్రాలను అందుకున్నారు. వీసీ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. …

Read More »

ప్రజావాణి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజావాణి …

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల మర్కల్‌ జాతీయ సేవా పథకం ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మర్కల్‌ గ్రామంలో జిల్లా రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు. యువకులు ఉత్సాహంగా 41 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని …

Read More »

టీయూలో మంత్రి జన్మదిన వేడుకలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మరియు ఇండ్లు, రోడ్లు, భవన నిర్మాణాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సౌత్‌ క్యాంపస్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్‌) అసోషియేషన్‌ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరై కేట్‌ కట్‌ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. …

Read More »

కాంగ్రెస్‌ నుండి తెరాసలోకి…

ఆర్మూర్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి సమక్షంలో ఆలూర్‌ ఎస్‌ఎంసి చైర్మన్‌ వెల్మ గంగారెడ్డి, వార్డ్‌ మెంబెర్‌ మర్కంటి మహేష్‌, కాంగ్రెస్‌ ఎస్‌.సి.సెల్‌ నాయకుడు గొంగటి సురేందర్‌ తెరాస పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే వారి స్వగృహంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మనఊరు, మనబడి కార్యక్రమాన్ని చేపట్టి మొదటి విడతలో ఆలూర్‌ …

Read More »

30 నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లివర్‌ సమస్యతో బాధపడుతున్న బాధితుడికి వైద్య సహాయం నిమిత్తం ఆరోగ్యశ్రీ కార్డును ఆరోగ్యశ్రీ కలెక్టరేట్‌ అధికారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చంద్రమోహన్‌ చేతుల మీదుగా బాధితుని కుటుంబానికి అందజేశారు. జుక్కల్‌ మండలం పెద్ద ఏడిగి గ్రామానికి చెందిన దేవాడే నాగనాథ్‌ లివర్‌ సంబంధిత వ్యాధితో బాధ పడుతుండగా వారికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో కామారెడ్డి జిల్లా …

Read More »

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఏవో రవీందర్‌, వివిధ శాఖల …

Read More »

మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్‌ ఔట్‌ రీచ్‌ బ్యూరో నిజామాబాద్‌ యూనిట్‌, మహిళా శిశు, దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు మంగళవారం బహుమతులను ప్రదానం చేస్తారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ పబ్లిక్‌ ఆఫీసర్‌ కె. శ్రీనివాస్‌ రావు, జిల్లా …

Read More »

ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణికి మొత్తం 104 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »