హైదరాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాల అడిషనల్ కలెక్టర్ల కై కేటాయించిన కియా కార్లను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కియా కార్లను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ పాల్గొన్నారు.
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 20 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 10 లక్షల 53 వేల 100 రూపాయల చెక్కులను, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీబీపెట్ మండలం యాడారం గ్రామానికి చెందిన గజ్వేల్లి సందీప్, తుజాల్ …
Read More »పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
నిజామాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమానికి వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్ హాజరై కాంగ్రెస్ భవన్ నుండి సాయిరెడ్డి పెట్రోల్ పంపు వరకు కేంద్ర ప్రభుత్వ …
Read More »నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు కార్యకర్తలు, నాయకులకు నిజామాబాద్ క్యాంప్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. తనను కలవడానికి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటించి మాస్క్ ధరించవలసిందిగా ఆమె కోరారు.
Read More »సీఎం కేసీఆర్ కాన్వాయ్ కి ఘనస్వాగతం
మోర్తాడ్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం సీఎం కాన్వాయ్ కి మోర్తాడు మండల తెరాస నాయకులు ఘన స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం లోని రేగుంట గ్రామంలో చీరాల ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి మృతి చెందడంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆయన కుటుంబానికి పరామర్శించడానికి వెళుతుండగా మోర్తాడ్ మండల టిఆర్ఎస్ నాయకులు గాండ్ల …
Read More »వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేసేందుకు ఎత్తిపోతల పథకం
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జహీరాబాద్ నారాయణఖేడ్ ఆందోల్ నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం కాళేశ్వరం నీటి ద్వారా సింగూర్ ప్రాజెక్టు నింపి సింగూరు నుంచి ఎత్తిపోతలకు నీటిని …
Read More »సురేందర్ రెడ్డికి సిఎం కేసీఆర్ నివాళి
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్ర రోడ్లుభవనాలు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, టిఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. బుధవారం విప్ బాల్క సుమన్ ను పరామర్శించడానికి మెట్‌పల్లి మండలం రేగుంట పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో వేల్పూర్‌లో …
Read More »బాల్క సురేశ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన సిఎం
జగిత్యాల, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మెట్ పల్లి మండలం రేగుంట గ్రామంలోని ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి అయిన స్వర్గీయ బాల్క సురేష్ చిత్ర పటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ముఖ్యమంత్రి తో పాటు జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే డా. సంజయ్ లు, పలువురు నాయకులు, అధికారులు …
Read More »బిజెపి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ కేంద్రాల పరిశీలన
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మున్సిపల్ కార్యాలయం వద్ద గల వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ సమస్యల గురించి, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు గురించి ప్రజలను, ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా …
Read More »పీఆర్‌సి కి కేబినెట్ ఆమోదం
హైదరాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ ( 9,21,037 మందికి) 30 శాతం పీఆర్‌సి ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెంచిన పీఆర్‌సి వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 …
Read More »