వేల్పూర్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం లక్కొరా గ్రామం లోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మెట్‌పల్లికి చెందిన తిరుపతి, పోసాని అక్కడికక్కడే మృతి చెందారని వేల్పుర్ ఎస్సై రాజ్ భారత్ రెడ్డి వెల్లడిరచారు. వరంగల్ నుండి ఆర్మూర్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు అతి వేగంగా వచ్చి ఆటోను …
Read More »రైతుబంధు లాంటి పథకం ప్రపంచంలోనే లేదు
వేల్పూర్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బంధు పథకం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదని అంత గొప్ప పథకాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా బుధవారం వేల్పూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ …
Read More »విద్యార్థులకు ఎన్ 95 మాస్కుల పంపిణీ
వేల్పూర్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం కుకునూరుపాఠశాలలో భారత్ సేవ సహకర సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎన్ 95 మాస్క్‌లను అందజేసినట్టు సంస్థ సభ్యులు భారత ఆహార సంస్థ డైరెక్టర్ రవీందర్ ర్యడా తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ కరోనా, ఓమిక్రన్ విజృంభిస్తుండడంతో సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాస్కులు అందజేయాలనే ఆలోచనతో రాష్ట్రంలో కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుక్కునూరు …
Read More »రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వంటపాత్రల వితరణ
వేల్పూర్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డిజిటల్ బోర్డులు, వంటపాత్రలు వితరణ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ కె. ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ సేవలు అందిస్తున్నామని తెలిపారు. అసిస్టెంట్ గవర్నర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ, పిల్లలు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని …
Read More »పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
వేల్పూర్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం తన మిత్రుల సహకారంతో సుమారు 31 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 8 …
Read More »అర్హులకే రెండు పడక గదుల ఇళ్ళు
వేల్పూర్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజమైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం గృహ నిర్మాణ శాఖ వేల్పూర్ మండల కేంద్రంలో నిర్మించిన 112 డబల్ బెడ్ రూమ్స్ ఇళ్లను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ …
Read More »ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…
వేల్పూర్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు విని సంతోషపడి కొంతకాలానికి తమ ఆశలు అడియాశలు అయ్యాయని, ఆవిరి అయ్యాయని తమ కుటుంబాలు వీధిన పడి ఆత్మ హత్యలకు గురయ్యారని రెవెన్యూ వీఆర్‌ఏ సంఘం వేల్పూర్ మండల ఉపాధ్యక్షులు టి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు శాంతియుత …
Read More »యాసంగి పంటలపై వేల్పూర్‌లో అవగాహన
వేల్పూర్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మోతే గ్రామంలో ఎంపిపి, గ్రామ సర్పంచ్ అధ్యక్షతన యాసంగి పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. యాసంగిలో వరి పంటకి బదులుగా మొక్కజొన్న, జొన్న, మినుము,పెసర వంటి పంటలు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేయవలసిందిగా సూచించారు. ఒకే పంట సాగు చేయడం వలన పంటకు వాడే ఎరువుల వలన …
Read More »సిసి కెమెరాలతో అనేక విషయాలు రికార్డు అవుతాయి…
వేల్పూర్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం లక్కొర గ్రామంలో ఎస్‌ఐ భరత్ రెడ్డి సీసీ కెమెరాల పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సీసీ కెమెరాల వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరగవని, గ్రామంలో జరుగుతున్న దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు రికార్డ్ అయి ఉంటాయని, సిసి కెమెరాల వల్ల కలిగే లాభాలను గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More »వరి ధాన్యం పరిశీలించిన బిజెపి నాయకులు
వేల్పూర్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని పడగల గ్రామంలో వరి ధాన్యాన్ని బాల్కొండ బిజెపి పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ రాజేశ్వర్‌తో, మండల స్థాయి నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా రాజేశ్వర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని హుజురాబాద్ ఎన్నికల్లో తెలంగాణ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోవడం పట్ల సీఎం కెసిఆర్ …
Read More »