కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మెడికల్ కళాశాలను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ల్యాబ్లను పరిశీలించారు. గ్రంథాలయంను సందర్శించి పుస్తకాలు కొరత ఉందని అధికారులు తెలపడంతో కావలసిన పుస్తకాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కళాశాలలో తాగు నీటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ సుజాతను ఆదేశించారు. తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించాలని తెలిపారు. మెడికల్ …
Read More »Blog Layout
జంతు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లిలో జంతువుల రక్షణ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కామారెడ్డి మున్సిపల్ ఆధ్వర్యంలో జంతువులకు రక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుక్కలకు ఇక్కడ శస్త్ర చికిత్సలు చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. కుక్కల బారీ నుంచి ప్రజలను రక్షించడానికి జంతువుల రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ …
Read More »కుళాయిల సమగ్ర సర్వే సజావుగా చేపట్టాలి
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామపంచాయతీలో కుళాయిల సమగ్ర సర్వే పంచాయతీ కార్యదర్శులు సజావుగా చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ రేట్లు సోమవారం పంచాయతీ కార్యదర్శులకు మిషన్ భగీరథ నీరు అందే సమగ్ర వివరాలను సేకరించే విధానంపై శిక్షణ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ …
Read More »కామారెడ్డిలో ప్రజావాణి ప్రారంభం
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లోకసభ ఎన్నికలు ముగిసిన అనంతరం సోమవారం ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో డిఆర్ డిఓ చందర్, కలెక్టరేట్ ఏ.ఓ.లతో కలిసి ప్రజల నుండి 50 వినతులను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ 33, వ్యవసాయం 5 సివిల్ సప్లై 2, మునిసిపల్ …
Read More »పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు
నిజామాబాద్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకుని అదనపు కలెక్టర్ అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆయన ఛాంబర్‌లో సోమవారం జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జూన్ 10, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి సాయంత్రం 4.51 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 10.41 వరకుయోగం : ధృవం సాయంత్రం 6.12 వరకుకరణం : భద్ర సాయంత్రం 4.51 వరకు తదుపరి బవ తెల్లవారుజామున 5.19 వరకు వర్జ్యం : ఉదయం 5.50 – 7.31దుర్ముహూర్తము : …
Read More »ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర సమావేశంలో పాల్గొన్న ఇందూరు ప్రతినిధులు
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్‌లోని ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సంస్థ వార్షిక యోజన సమావేశంలో ఇందూరు జిల్లా ప్రతినిధులుగా విశ్రాంత ఆచార్యులు నరేష్ కుమార్, సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్ పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఇతిహాస సంకలన సమితి జాతీయ సంఘటన కార్యదర్శి బాలముకుందు పాండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత …
Read More »సోమవారం నుండి యధావిధిగా ప్రజావాణి
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి …
Read More »ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏ, బి బ్లాకులు, ఎస్ ఆర్ కే డిగ్రీ కాలేజీ, వి ఆర్ కే డిగ్రీ కాలేజీ, ఆర్ కే …
Read More »గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాణిక్ బండార్ సమీపంలో గల కాకతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలతో పాటు, ఎస్.ఆర్ కాలేజీలో కొనసాగుతున్న గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. …
Read More »