Blog Layout

అంబేద్కర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

రెంజల్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సర్పంచ్‌ అలిమా ఫారూఖ్‌ పటేల్‌ అన్నారు.శుక్రవారం మండలంలోని పేపర్‌ మిల్‌ గ్రామంలో విశ్వ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ప్రధాన వీధుల గుండా నీలీ …

Read More »

ఈవిఎం గోదామును పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. కేంద్రాల్లో ఉన్న ఈవీఎంల, వివి ప్యాడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకుడు సాయిబుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.

Read More »

నర్సరీ నిర్వహణ తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చదనం పెంపొందించడంలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని కేశాపూర్‌ గ్రామంలో నెలకొల్పిన హరితహారం నర్సరీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం పట్ల కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేశాపూర్‌ లో కలెక్టర్‌ శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా, పక్కనే ఉన్న నర్సరీని గమనించి అక్కడికి వెళ్లి పరిశీలించారు. నర్సరీలో విత్తనాలు మొలకెత్తకపోవడం, మొక్కలు …

Read More »

ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని కేశాపూర్‌, డిచ్‌పల్లి మండలంలోని బర్దిపూర్‌ గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ శుక్రవారం అదనపు కలెక్టర్‌ …

Read More »

ఆర్మూర్‌లో కొనసాగుతున్న జేపిఎస్‌ల సమ్మె

ఆర్మూర్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూరు పట్టణంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె ఏడవ రోజు సందర్భంగా అంబేద్కర్‌ చౌరస్తాలో డివిజన్‌ స్థాయి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేపట్టారు. అంతకుముందు ఇటీవల మరణించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మాపట్ల ప్రభుత్వం వెంటనే స్పందింది జూనియర్‌ పంచాయతీ …

Read More »

తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూనియర్‌ పంచాయతీ అధికారులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందజేశారు. జూనియర్‌ పంచాయతీ అధికారులు రెగ్యులర్‌ చేయాలని ఎంత మోర పెట్టుకున్న చేయడం లేదని, మూడు సంవత్సరాల పాటు ప్రొవిషన్‌ తర్వాత ప్రెజర్‌ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ రెగ్యులర్‌ చేయడం …

Read More »

కొనసాగుతున్న వివోఏల సమ్మె

ఆర్మూర్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐకేపి వివోఏ ల సమ్మె 11వ రోజుకు చేరింది. ఆర్మూర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్థ సమీపంలో తలపెట్టిన సమ్మె గురువారంతో 11 వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. గత 20 యేండ్లుగా విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం తాను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. వర్కింగ్‌ అధ్యక్షుడు నర్సాగౌడ్‌ మాట్లాడుతూ వివోఏలకు కనీసం గౌరవ …

Read More »

ఆర్మూర్‌ 33 వ వార్డులో దౌర్జన్యం

ఆర్మూర్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన సొంత పట్టా స్థలంలో వేసుకున్న కాంపౌండ్‌ వాల్‌ను కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారని బాధితుడు గంగాచరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు చరణ్‌ మాట్లాడుతూ ఆర్మూర్‌ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు సమీపంలో 33వ వార్డు సర్వేనెంబర్‌ 230 లో తన 500 గజాల స్థలంలో ప్రికాస్ట్‌ వేసుకోవడం జరిగిందని తెలిపారు. రెండు రోజుల క్రితం …

Read More »

సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గీతా పారిశ్రామిక సహకార సంఘం నెంబర్‌ వన్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాల అభిషేకం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు బండారి రాజ గౌడ్‌, మాజీ అధ్యక్షులు గోపి గౌడ్‌, హరికిషన్‌ గౌడ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతు బీమా తరహా గీత కార్మికులకు ప్రమాద బీమా పథకం వర్తిస్తుందని చెప్పినందుకు, వారికి ప్రత్యేకంగా …

Read More »

తడిసిన ధాన్యానికి ప్రభుత్వమే మద్దతు ధర కల్పించాలి

రెంజల్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తడిసి ముద్దయి మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కోశాధికారి, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని దూపల్లి, వీరన్న గుట్ట, రెంజల్‌, సాటాపూర్‌ గ్రామాలలో తడిసి ముద్దయిన ధాన్యపురాసులు, మొలకెత్తిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »