Blog Layout

లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

ఎడపల్లి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని వైద్య ఆరోగ్య శాఖ హెచ్‌ఈఓ రాజేశ్వర్‌ పేర్కొన్నారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ (ఫ్రీ-కాన్షక్షన్‌ -ఫ్రీ -నాటల్‌ డయోగ్నస్టిక్‌ టెస్ట్స్‌)పై అంగన్వాడీ, ఆశా, మహిళా సంఘాల ప్రతినిధులు, ఏఎన్‌ఎం లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ గురించి క్షేత్ర …

Read More »

ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాల సంఖ్య పెంచాలి

కామారెడ్డి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వసతులు, సమస్యల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్‌ కు దీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్యా బోధన కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తారని …

Read More »

హిస్టరీ కాంగ్రెస్‌ సమావేశాల బ్రోచర్‌ విడుదల చేసిన విసి

డిచ్‌పల్లి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్‌ 65 వ సమావేశాలు తెలంగాణ విశ్వవిద్యాలయం డిచ్‌పల్లి మెయిన్‌ క్యాంపస్‌లోని న్యాయ కళాశాలలో ఈనెల 28,29 తేదీలలో నిర్వహించే సమావేశాల బ్రోచర్‌ను సోమవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి రవీందర్‌ చేతుల మీదుగా సంస్థ ప్రతినిధులు ఆవిష్కరింపజేశారు. వర్సిటీలో జరిగే సమావేశాలకు తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చరిత్ర …

Read More »

ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర …

Read More »

ప్రతీ వారం క్షేత్రస్థాయి పరిశీలన జరపాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 110 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో …

Read More »

సేవాలాల్‌ స్వాముల బైక్‌ ర్యాలీ

బాన్సువాడ, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని సేవాలాల్‌ స్వాములు సోమవారం నిజాంసాగర్‌ మండలంలోని తున్కిపల్లి తండా నుండి బైక్‌ర్యాలీ నిర్వహించి బాన్సువాడ పట్టణంలోని బాల బ్రహ్మచారి శ్రీశ్రీశ్రీ రామ్‌రావ్‌ మహారాజ్‌ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భోగ్‌ భండార్‌ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు బద్యా నాయక్‌ మాట్లాడుతూ సేవాలాల్‌ దీక్ష స్వాములు …

Read More »

నవోదయకు లిటిల్‌ ప్లవర్‌ విద్యార్థిని ఎంపిక

రెంజల్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండల కేంద్రంలోని లిటిల్‌ ప్లవర్‌ పాఠశాలకు చెందిన విద్యార్థిని కృతి సహస్ర జవహర్‌ నవోదయకు ఎంపిక అయిందని కరస్పాండెంట్‌ హన్మాండ్లు ఒక ప్రకటనలో తెలిపారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని కృతి సహస్ర ఉత్తమ ప్రతిభ కనబరిచి జవహర్‌ నవోదయకు ఎంపికవడం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. అనంతరం విద్యార్థినీకి పాఠశాల యాజమాన్యం శాలువా పులమాలలతో ఘనంగా సన్మానించారు.

Read More »

పేదల పెన్నిధి సీఎం కేసీఆర్‌

రెంజల్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజల పెన్నిధి, ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడుó ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన సగ్గు శేఖర్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 26 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిది …

Read More »

27,28 తేదీల్లో జాతీయ సదస్సు

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27, 28 తేదీలలో తెలంగాణ యూనివర్సిటీ సారంగాపూర్‌లోని బీఈడీ కాలేజీలో జాతీయ సదస్సు ‘‘జాతీయ విద్యా విధానం 2020 అవకాశాలు – సవాళ్లు’’ అనే అంశంపైన నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఎ. మహేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ సదస్సుకు ముఖ్య వక్తలు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ఇతర బి.ఈ.డి కళాశాలల లెక్చరర్లు, పరిశోధక …

Read More »

పచ్చదనం పరిశుభ్రతలో అర్గుల్‌కు అవార్డు

ఆర్మూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ స్థాయి పురస్కారాలలో భాగంగా శనివారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లాలో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పచ్చదనం పరిశుభ్రతలో మొదటి అవార్డు సాధించిన అర్గుల్‌ గ్రామపంచాయతీకి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, జిల్లా పంచాయతీ అధికారిని జయసుధ చేతుల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »