Blog Layout

నాగారం రోడ్డు మార్గాన్ని సర్వే చేయాలి

నిజామాబాద్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌ లోని వినాయకనగర్‌, గాయత్రీ నగర్‌ నుండి రేడియో స్టేషన్‌ మీదుగా నాగారం వరకు ప్రతిపాదించిన 100 ఫీట్స్‌ రోడ్డును సర్వే చేయాలని మాస్టర్‌ ప్లాన్‌ బాధితుల కమిటీ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ నారాయణ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదిత రోడ్డు ఏ సర్వే నంబర్ల, ప్లాట్స్‌ గుండా పోతుందో, అర్థం కాక ప్రజలు అయోమయానికి …

Read More »

పెండిరగ్‌ ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు …

Read More »

దరఖాస్తు దారులకు న్యాయం జరిగేలా చూడాలి

కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం …

Read More »

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఎడపల్లి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం జాన్కంపేట్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్య సమస్యలతో ఆదివారం పశువుల కొట్టంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఒడ్డె యాదగిరి (45) అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెంది గ్రామ శివారులోని పశువుల కొట్టంలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొద్ది రోజులుగా మృతుడు అనారోగ్యం …

Read More »

విద్యుత్‌ వినియోగదారులకు గమనిక….

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేపు అనగా 9వ తేదీ సోమవారం కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్‌ సబ్‌స్టేషన్‌, హౌసింగ్‌ బోర్డ్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో గల కాలనీలు, హూసింగ్‌ బోర్డ్‌ కాలనీ, దేవునిపల్లీ, విద్యానగర్‌, కాకతీయ నగర్‌ మరియు నరసన్న పల్లి సబ్‌స్టేషన్‌, రాజంపేట సబ్‌స్టేషన్‌, చిన్న మల్లారెడ్డి సబ్‌ స్టేషన్‌, పరిధిలో గల గ్రామాలకు విద్యుత్‌ మరమ్మత్తుల కారణంగా మధ్యాహ్నం 1 …

Read More »

హలొ బీసీ చలో హైదరాబాద్‌

నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసిల పోరుయాత్ర ముగింపు బహిరంగ సభకు ఆదివారం నాయకులు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ చదువు కోసం సామాజిక న్యాయ సాధన కోసం తలపెట్టిన బీసీ పొరుయాత్ర డిసెంబర్‌ 2వ తేది నుండి జనవరి 8 వ తేదీ వరకు పాలమూరు నుండి పట్నం వరకు బిసీల …

Read More »

క్యాన్సర్‌ బాధిత మహిళకు రక్తం అందజేత

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మహిళ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నడంతో వారికి కావలసిన ఏ నెగిటివ్‌ రక్తం జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రాల్లో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆరోగ్య విస్తరణ అధికారి చలపతికి తెలియజేయగానే మానవత …

Read More »

ఆకట్టుకున్న ఉపన్యాసాలు

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్‌ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి (పరాక్రమ్‌ దివస్‌) సందర్భంగా జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు సుభాష్‌ నగర్‌ లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌, ఆకాశవాణి అధికారి మోహన్‌ దాస్‌ నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఉపన్యాస పోటీలు ప్రారంభించారు. వివిధ మండలాల …

Read More »

సివిల్స్‌ విద్యార్థికి కలెక్టర్‌ అభినందన

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆల్‌ ఇండియా అడ్వకేట్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల ఢల్లీిలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బాలకృష్ణ చేతుల మీదుగా బాన్సువాడకు చెందిన షేక్‌ షార్జిల్‌ పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లా నోడల్‌ అధికారి షేక్‌ సలాం కుమారుడు షేక్‌ షార్జీల్‌ కరోనా సమయంలో పేద విద్యార్థులకు ఆన్లైన్లో ఉచితంగా తరగతులు బోధించారు. శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి …

Read More »

జనవరి 11 వరకు రైతులు అభ్యంతరాలు తెలపవచ్చు

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 11 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రైతులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ బి పాటిల్‌ విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కూడలిలో వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మాస్టర్‌ ప్లాన్‌ వివరాలను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »