Blog Layout

పలు షాపింగ్‌ మాల్ల పై కేసులు నమోదు

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి, జిల్లా కేంద్రంలోని బట్టల వ్యాపారం చేసే మూడు షాపింగ్‌ మాల్‌లపై పలు కేసులు నమోదు చేసినట్లు జిల్లా తూనికల కొలతల అధికారి సుజాత్‌ అలీ తెలిపారు. ప్యాకేజింగ్‌ కమాడిటీస్‌ యాక్టు ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కిసాన్‌ ఫ్యాషన్‌ మాల్‌, ఎల్‌విఆర్‌ షాపింగ్‌ మాల్‌, బాంబే క్లాత్‌ హౌస్‌లపై పలు కేసులు నమోదు చేశామని తూనికల కొలతల …

Read More »

కోడిగుడ్డు బిల్లులు రాలే… పండగ పూట పస్తులే….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మధ్యాహ్న భోజన పనివారికి దసరా పండగ వెళ పస్తులే ప్రభుత్వం మిగిల్చిందని, అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టు పరిస్థితి ఉందని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి అన్నారు. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 9వ, 10వ తరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజన …

Read More »

మహాత్మునిపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటు..

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కత్తా నగరంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా భారత జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరిచే విధంగా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐవిఎఫ్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్‌ గుప్తా, ఐవీఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ బాలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అనుసరించిన మార్గం …

Read More »

గోకుల్‌ తండాలో హైమాక్స్‌ విద్యుత్‌ దీపాల వెలుగులు

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్‌ తండా గ్రామంలో జాహిరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు బీబీపాటిల్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ సహకారంతో 1.50 లక్ష యాభై వేల రూపాయలతో గ్రామం మధ్యలో ఏర్పాటు చేసిన హెమక్స్‌ లైట్స్‌ను రామారెడ్డి ఎంపీపీ దశరథ రెడ్డి, ఉమ్మడి సదాశివనగర్‌ మాజీ జడ్పీటీసీ పడిగేల రాజేశ్వర్‌ రావుతో కలిసి ప్రారంభించారు. స్థానిక సర్పంచ్‌ లలిత …

Read More »

జిల్లా ప్రజలకు ప్రముఖుల విజయ దశమి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా పాలనాధికారి సి.నారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయ దశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం …

Read More »

క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన అథ్లెటిక్స్‌ క్రీడాకారులకు మెడల్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలకు క్రీడాకారులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం …

Read More »

జిమ్‌ కేంద్రం ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో జిమ్‌ కేంద్రాన్ని మంగళవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలోని పరికరాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1000, నెలవారి ఫీజ్‌ రూ.100 ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల …

Read More »

ప్లేట్‌లెట్స్‌ అందజేసి ప్రాణాలు కాపాడిన అధ్యాపకుడు

కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన జ్యోతి ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో చికిత్సపొందుతుంది. తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన స్ఫూర్తి డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు బంధం ప్రవీణ్‌కు తెలియజేయడంతో మానత దృక్పథంతో వెంటనే స్పందించి కెబిసి రక్తనిధి కేంద్రంలో ఓ పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ను అందజేసి ప్రాణాలను కాపాడారని ఐవిఎఫ్‌ …

Read More »

ప్రజావాణికి 56 ఫిర్యాదులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సమస్యలపై అర్జీలు సమర్పించారు. అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ జెడ్పి సీఈఓ గోవింద్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌ అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలను నివేదిస్తూ ప్రజల నుండి మొత్తం …

Read More »

ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్‌ చంద్రమోహన్‌ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు రెవెన్యూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »