శనివారం, జనవరి. 18, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : పంచమి పూర్తివారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 3.11 వరకుయోగం : శోభనం రాత్రి 1.51 వరకుకరణం : కౌలువ సాయంత్రం 6.16 వరకు వర్జ్యం : రాత్రి 11.02 – 12.47దుర్ముహూర్తము : ఉదయం 6.37 – 8.06అమృతకాలం : ఉదయం 8.17 – …
Read More »Blog Layout
ప్రమాదరహిత ప్రయాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలి..
బాన్సువాడ, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్లపై ప్రయాణించే వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించి ప్రమాద రహిత ప్రయాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం బాన్సువాడ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రత నియమాలపై ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ …
Read More »ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతిగా డా. మావురపు సత్యనారాయణ రెడ్డి
డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాదిపతి గా డా.మావురపు సత్యనారాయణ రెడ్డి ని నియమిస్తూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ ఆచార్య యాదగిరిరావు మాట్లాడుతూ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ప్రసిద్ధి చెందిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూ ఢల్లీి నుండి పీహెచ్డీ కొరకు మధుమేహం …
Read More »20 లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. ముప్కాల్ మండలం నాగంపేట్, బాల్కొండ మండలం జలాల్పూర్, ఆర్మూర్ …
Read More »రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి…
కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో కొద్ది సేపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలపై చర్చించారు. 100 శాతం సర్వే చేయాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని సర్వే నెంబర్ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జనవరి 17, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : చవితి తెల్లవారుజామున 5.31 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మఖ మధ్యాహ్నం 1.22 వరకుయోగం : సౌభాగ్యం రాత్రి 1.52 వరకుకరణం : బవ సాయంత్రం 4.58 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 5.31 వరకు వర్జ్యం : రాత్రి 9.58 – 11.41దుర్ముహూర్తము : ఉదయం …
Read More »స్కానింగ్ సెంటర్లపై విస్తృత తనిఖీలు చేపట్టాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు. డా.రవీందర్ నాయక్ గురువారం కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల వారిగా ప్రగతి గురించి ప్రోగ్రాం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు అమలు గురించి ప్రయివేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ గురించి సమీక్షించారు. ప్రతిఒక్క …
Read More »రేషన్ కార్డుల సర్వే పక్కాగా నిర్వహించాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. గురువారం దోమకొండ మండలం చిత్తమాన్ పల్లి, బీబీపెట్ మండలం తుజల్పూర్ గ్రామాలలో రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ల తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా …
Read More »సౌదీ బాధితుడి గురించి స్పందించిన సీఎంఓ
హైదరాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలో చిక్కుకున్న జగిత్యాల పట్టణానికి చెందిన కుక్కల చిన్న భీమయ్యను ఇండియాకు వాపస్ తెప్పించాలని అతని బ్యార్య గంగలక్ష్మి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) స్పందించింది. సాధారణ పరిపాలన శాఖ – ప్రవాసీ భారతీయుల విభాగం (జీఏడి – ఎన్నారై) ముఖ్య కార్యదర్శి …
Read More »పద్మశాలి సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ
బాన్సువాడ, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ మందిరంలో గురువారం పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పద్మశాలి సంఘ నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రాజయ్య, రాష్ట్ర సంఘ కార్యదర్శి గొంట్యాల బాలకృష్ణ, శ్రీనివాస్, నరహరి, కాశీనాథ్, వెంకటేష్, అనిల్, మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి, లత, రేఖ, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More »