Blog Layout

కొత్త ఉద్యోగాలు లేవు ‍‍‍ – స్పష్టం చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్‌) లో కొత్త ఉద్యోగాలు ఏవీ లేవని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కొత్త కలెక్టరేట్‌ లో ఏవైనా కొలువు ఇప్పించాలని కోరుతూ సోమవారం నాటి ప్రజావాణి సందర్భంగా పలువురు కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ, న్యూ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లో కొత్త కొలువులు ఏవీ లేవని ఖరాఖండిగా …

Read More »

ప్రశాంతంగా ప్రారంభమైన పి.జి. పరీక్షలు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన రెండవ, నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 2546 నమోదు చేసుకోగా, 2335 మంది హాజరు, 211 విద్యార్థులు గైర్హాజరు …

Read More »

1 – 19 సంవత్సరాల వయస్సు వారందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 01 నుండి 19 సంవత్సరాల వరకు వయస్సు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ మేరకు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 వ తేదీన జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అల్బెన్‌ డజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని …

Read More »

ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »

రేపటి నుండి పిజి ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో, అనుబంధ కళాశాలలో పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 12 వ తేదీ సోమవారం నుండి ప్రారంభమవుతాయని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య విద్యావర్థిని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని పిజి విద్యార్థులు గమనించాలని సూచించారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ సందర్శించాలని పేర్కొన్నారు.

Read More »

రేపే పాదయాత్ర ప్రారంభం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకొని ఎబివిపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఇందూరు విభాగ్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ఖిల్లా రామాలయం నుండి వెయ్యి ఉరిల మర్రి నిర్మల్‌ వరకు 75 కిలో మీటర్లు 75 మంది ఎబివిపి కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పరిషత్‌ ప్రతినిధులు తెలిపారు. 12వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. …

Read More »

కృష్ణంరాజు అకాలమరణం బాధాకరం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ సినీ నటులు రెబెల్‌ స్టార్‌ కృష్ణంరాజు అకాల మరణం బాధాకరం అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారు జామున కృష్ణంరాజు మరణించగా, జూబ్లీహిల్స్‌ లోని వారి నివాసానికి మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ చేరుకొని కృష్ణంరాజు పార్దీవదేహం పై పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణంరాజు సతీమణి, ప్రముఖ హీరో …

Read More »

సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీఆర్‌ఏలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అసెంబ్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. 49 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించని కారణంగా తీవ్ర మనస్థాపానికి చెందిన ఇద్దరు వీఆర్‌ఏలు ఆత్మహత్యకు పాల్పడగా మరో 26 మంది గుండె పోటు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించారని సీఎల్పీ నేతకు …

Read More »

ఐఎఫ్‌టియు పోరాట ఫలితం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికుల జీవనభృతికై 2014 జూన్‌ కటాఫ్‌ తేదీని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి, శ్రామిక భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ… బీడీ కార్మికులకు జీవన భృతి అమలు చేయుటకు అడ్డంకిగా వున్న …

Read More »

ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ నిజామాబాద్‌, ఇందుర్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నగరంలోని తిలక్‌ గార్డెన్‌ వద్ద గల లేడీస్‌ క్లబ్‌లో మహిళ అధ్యాపకులు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ నిజామాబాద్‌ అధ్యక్షురాలు సాక్షి బన్సల్‌ మాట్లాడుతూ సమాజంలో విద్యార్థుల భవితను తీర్చిదిద్దరంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని మహిళా అధ్యాపకులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »