Blog Layout

5న సీఎంను నిలదీస్తాం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానం ప్రకారం ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్‌ఎస్‌ఎఫ్‌ రక్షణ కమిటీ నాయకులు ఈరోజు షుగర్‌ ఫ్యాక్టరీ గేటు ముందర సమావేశమై డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ సమయంలో బోధన్‌ కు వచ్చిన సందర్భంలో కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏర్పాటు అయినా 100 రోజుల్లో ఫ్యాక్టరీని ప్రభుత్వము స్వాధీనం …

Read More »

బిఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్‌ నూతన కామన్‌ కోర్‌ సిలబస్‌ రూపకల్పన

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బయో టెక్నాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. ప్రవీణ్‌ మామిడాల సమన్వయ కర్తగా తెలంగాణలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు బిఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్‌ కామన్‌ కోర్‌ సిలబస్‌ రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌కు సమర్పించారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి ఎంపిక చేసిన కొన్ని డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ స్థాయిలో బిఎస్సీ …

Read More »

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో లోటుపాట్లకు తావుండకూడదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నిజామాబాద్‌కు విచ్చేస్తున్న సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్‌) వద్ద చేపడుతున్న ఏర్పాట్లను గురువారం పోలీస్‌ కమిషనర్‌ నాగరాజుతో కలిసి కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి …

Read More »

కామారెడ్డిలో గణేష్‌ ఉత్సవాలు

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్లో జనహిత గణేష్‌ మండలి ఆధ్వర్యంలో గణేష్‌ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా గణేష్‌ విగ్రహానికి బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ దంపతులు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు అన్ని వర్గాల ప్రజలు ఘనంగా …

Read More »

భాష నిరంతరం మార్పులకు లోనవుతుంది

హైదరాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో మాట్లాడే భాష మాండలికం కాదని, అది మూల భాషకు దగ్గరగా ఉన్న జీవద్భాష అని డా. నలిమెల భాస్కర్‌ వ్యాఖ్యానించారు. ఆర్ట్స్‌ కాలేజ్‌ వేదికగా తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొ. సి. కాశీం అధ్యక్షతన జరిగిన ‘‘తెలుగు భాష – గిడుగు ప్రాసంగికత’’ అనే అంశంపై మాట్లాడుతూ భాష నిరంతరం మార్పులకు లోనవుతుందని, పరిశోధకులు సునిశిత పరిశీలనతో …

Read More »

కొత్త పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండలంలో నూతనంగా మంజూరైన 1,551 నూతన అసరా పెన్షన్‌ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణి చేశారు. భిక్కనూర్‌ మండల కేంద్రంతో పాటు రామేశ్వర్‌ పల్లి, బస్వాపూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంజూరు చేసిన …

Read More »

ఐవిఎఫ్‌ సేవలు అభినందనీయం

కామరెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఐవిఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి జిల్లా జడ్జ్‌ శ్రీదేవి, సబ్‌ కోర్టు జడ్జి కిరణ్‌ కుమార్‌లకు ఐవిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు విశ్వనాధుల మహేష్‌ గుప్తా మట్టి గణపతుల ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా జడ్జ్‌ శ్రీదేవి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలుగకూడదని ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ తో చేసిన విగ్రహాల వలన …

Read More »

సెప్టెంబర్‌ 8 వరకు పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. కోర్సుకు చెందిన రెండవ, నాలుగవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ పరీక్ల ఫీజు గడువు సెప్టెంబర్‌ 8 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. పరీక్షలు సెప్టెంబర్‌ నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక 100 రూపాయల ఆలస్య అపరాధ …

Read More »

టీయూలో చిత్రలేఖనం, రంగోళి పోటీల నిర్వహణ

డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు కొనసాగుతున్నాయని కల్చరల్‌ ఆక్టివిటీస్‌ అండ్‌ యూత్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డా. వంగరి త్రివేణి తెలిపారు. కాగా, అందులో భాగంగా మంగళవారం ఉదయం ‘‘చిత్రలేఖనం’’, మధ్యాహ్నం ‘‘రంగోళి’’ పోటీలను నిర్వహించామని తెలిపారు. పోటీలకు బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ …

Read More »

మట్టి గణపతులు పంపిణీ చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ రేట్లు మంగళవారం మట్టి గణపతులను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పంపిణీ చేశారు. మట్టి గణపతులను పెట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతోందని సూచించారు. తొమ్మిది రోజులపాటు మట్టి గణపతులకు పూజలు చేయాలని సూచించారు. ఉద్యోగులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఓ రాజారాం, ఏవో రవీందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »