నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన రంగోళీ పోటీలు మహిళల సృజనాత్మకతను ఆవిష్కరింపజేశాయి. పెద్ద సంఖ్యలో యువతులు, మహిళలు పోటీల్లో పాల్గొని, దేశభక్తి, జాతీయతా భావం ఉట్టిపడే రీతిలో అందమైన రంగులతో ఆకర్షణీయంగా ముగ్గులు వేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటేలా పలువురు రంగవల్లులు వేయగా, మరికొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, …
Read More »Blog Layout
శ్రీనగర్ బాలహనుమాన్ ఆలయంలో జన్మాష్టమి వేడుకలు
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని శ్రీనగర్ బాలహనుమాన్ ఆలయంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారి అలంకరణ, నైవేద్యం ఏర్పాటు చేశారు. అనంతరం కాలనీ చిన్నారులు ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై శ్రీ కృష్ణ నినాదాలతో మారుమోగింది.
Read More »అఖిలభారతీయ భగవద్గీతా పచ్రార మండలి ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని స్థానిక స్టేషన్ రోడ్డులోగల అఖిలభారతీయ భగవద్గీతా పచ్రార మండలిలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ భగవానునికి నవవిధ అభిషేకాలు, లోక కళ్యాణార్థం యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి ప్రధాన కార్యదర్శి మేడిచర్ల పభ్రాకర్ ఉపన్యసిస్తూ భాగవతంలో …
Read More »బాలశ్రీనివాస మూర్తికి ధర్మనిధి పురస్కారం
డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ సాహిత్య పరిశోధకులు, విమర్శకులు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తికి 2022 సంవత్సరానికి గాను డా. తిరుమల శ్రీనివాసాచార్య – స్వరాజ్యలక్ష్మి ధర్మనిధి పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ కవి డా. తిరుమల శ్రీనివాసాచార్య ఏర్పాటు చేసిన ఈ పురస్కారానికి సాహితీ రంగంలో విశేష సేవలు అందిస్తున్నందుకు డా. జి. …
Read More »చిట్‌ఫండ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని బాధితుని ఫిర్యాదు
బోధన్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ ప ట్టణంలో ఓ ప్రయివేటు చిట్‌ఫండ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు శుక్రవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చిట్‌ఫండ్ కంపెనీ గత 48 నెలలుగా చిట్టి డబ్బులు లక్ష 92 వేల రూపాయలు కట్టించుకొని తమకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా గత కొన్ని నెలలుగా సతాయిస్తున్నాడంటూ బాధితుడు వాపోయాడు. వెంటనే చిట్‌ఫండ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని …
Read More »విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తున్నాం
డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఉపకులపతి తెలిపారు. ఆట స్థలం మైదాన ప్రాంతంలో నాలుగు రోజుల నుంచి గడ్డిని, పిచ్చి మొక్కలను తీసివేస్తూ చదును చేస్తున్నామని, ట్రాక్టర్లతో బ్లేడిరగ్ వేయిస్తున్నామని ఆయన తెలిపారు. బాలికల వసతి గృహం ప్రవేశ ద్వారం, ప్రహరీ గోడ పరిసర ప్రాంతంలో గడ్డి, పిచ్చి మొక్కలు తీయించి పరిశుభ్రం చేయడం …
Read More »సెప్టెంబర్ 3 న వార్షికోత్సవం
డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 3వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తెలిపారు. అందుకోసం ఈ నెల 22 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, రంగోళి, క్విజ్, పాటలు, నృత్యాలలో …
Read More »రెడ్ క్రాస్ సొసైటి సేవలు అభినందనీయం
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలంలో భవానిపేట్ గ్రామంలో ఇండియన్ జిప్సి డెవలప్ మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తాను సొంతంగా 25 మంది అనాథ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ ప్రభుత్వ విప్ గంప …
Read More »పిఆర్‌టియు ఆధ్వర్యంలో ప్రీడమ్ ర్యాలీ
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయడానికి స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం పిఆర్టియు ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను ఏర్పాటు చేసిందని …
Read More »సోమవారం ప్రజావాణి లేదు
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలు తమకు సహకరించాలని కోరారు.
Read More »