Blog Layout

హోరా హోరీగా జిల్లా స్థాయి చెస్‌ టోర్నమెంట్‌

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా చెస్‌ అసోసియేషన్‌ సహకారంతో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్‌ టోర్నమెంట్‌ హోరాహోరీగా ముగిసిందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ తెలిపారు. ఉదయం 11 గంటలకు సుభాష్‌ నగర్‌ నెహ్రూ యువ కేంద్రలో జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ చేతుల మీదుగా ప్రారంభమైన పోటీలు, సాయంత్రం 5గంటలకు ముగిసాయి. జూనియర్‌, …

Read More »

సీజనల్‌ వ్యాధులు సోకకుండా విస్తృత స్థాయిలో ముందస్తు చర్యలు

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఎక్కడ కూడా డెంగ్యూ, మలేరియా, అతిసారం, విషజ్వరాలు వంటి సీజనల్‌ వ్యాధులు సోకకుండా విస్తృత స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, వసతి గృహాల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, విద్యార్థులకు రక్షిత మంచినీటి సరఫరా …

Read More »

చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి

కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్‌ కాలనీ అంగన్వాడి కేంద్రంలో సోమవారం అతి తక్కువ బరువున్న పిల్లలను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలకు కొత్తగా వచ్చిన బాలామృతం ప్లస్‌ గురించి తెలిపారు. పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడి కార్యకర్తలు తమ చిన్నారులకు పౌష్టికారం అందించే విధంగా అవగాహన …

Read More »

పంట ముంపునకు గురైన ప్రాంతాలు పరిశీలించిన మంత్రి

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉదృతంగా ప్రవహించి పంట ముంపుకు గురయిన ప్రాంతాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి గారు క్షేత్ర స్థాయిలో సోమవారం పరిశీలించారు. గ్రామస్థులు, రైతులతో మాట్లాడారు. పంట నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధిక వరదల నేపథ్యంలో పంట పొలాల్లో ఇసుక మేటలు …

Read More »

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డెంగీ, మలేరియా, అతిసారం వంటి వ్యాధులు వ్యాపించకుండా వైద్య సిబ్బంది , మండల స్థాయి అధికారులు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో పారిశుద్ధ్యం, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడారు. డెంగీ, మలేరియా …

Read More »

విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి

కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మైనార్టీ బాలికల స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో సోమవారం మధ్యాహ్న భోజనాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్‌ పరిశీలించారు. విద్యార్థులకు వండే బియ్యాన్ని, పప్పులను చూశారు. వంటశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థీనులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని పేర్కొన్నారు.

Read More »

సోమవారం ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. బోనాల పండుగ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. జిల్లా ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు.

Read More »

పారిశుద్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలి

కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు రెండు వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారులు గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆదివారం ఆయన పారిశుద్ధ్య కార్యక్రమాలపై జిల్లా పంచాయతీ అధికారులతో మాట్లాడారు. ఈనెల 24 నుంచి ఆగస్టు 2 వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో రోడ్లపై …

Read More »

వాహనాల చోరీ.. నిందితుడి అరెస్టు

ఆర్మూర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోటర్‌ సైకిళ్లను చోరీ చేస్తున్న పెర్కిట్‌కు చెందిన మహ్మద్‌ వాహీద్‌ అలీ (19) అనే దొంగను అరెస్టు చేసి పది మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. ఆర్మూర్‌ పట్టణంలోని సిద్దులగుట్ట వెనక గల దోబీఘాట్‌ వద్ద 63వ జాతీయ రహదారిపై …

Read More »

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే నెల ఆగస్టు ఒకటవ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ఆదేశించారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలనిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్‌ శనివారం తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆగస్టు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »