Blog Layout

ప్రతిపాదనలు త్వరగా పూర్తిచేయాలి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు మన బడి మొదటి విడతకు ఎంపికైన పాఠశాలల ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో విద్యాశాఖ, ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను సందర్శించి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రతిపాదనలను పూర్తిచేయాలని కోరారు. ఉపాధి హామీ …

Read More »

తెలుగులో ఇద్దరికి డాక్టరేట్‌ ప్రదానం

డిచ్‌పల్లి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో పరిశోధక విద్యార్థులు ముత్తారెడ్డి రాజు, రాగుల సుధాకర్‌ పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా (మౌఖిక పరీక్ష) శనివారం నిర్వహించారు. ఆచార్య పి. కనకయ్య పర్యవేక్షణలో పరిశోధకులు ముత్తారెడ్డి రాజు ‘‘మాస్టార్జీ గేయ రచనలు – అనుశీలన’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రూపొందించారు. డా. నాళేశ్వరం శంకరం …

Read More »

సత్వరమే తాగునీటి సమస్య పరిష్కరించాలి

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని 5వ డివిజన్‌ బోర్గాం (పి) పరిధిలో తాగునీరు, విద్యుత్‌ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌, రూరల్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి సాయగౌడ్‌ మాట్లాడారు. 5వ డివిజన్‌ పరిధిలో గంగమ్మ గుడి కాలనీలో …

Read More »

కొనసాగుతున్న డిగ్రీ వన్‌ టైం చాన్స్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సుకు చెందిన మొదటి, రెండవ, మూడవ ఇయర్‌ వైస్‌ (వన్‌ టైం చాన్స్‌) థియరీ పరీక్షలు శుక్రవారం కూడా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సంవత్సర థియరీ పరీక్షలకు మొత్తం అయిదుగురు నమోదు చేసుకోగా ముగ్గురు హాజరు, ఇద్దరు గైర్హాజరు …

Read More »

మార్క్‌ఫెడ్‌ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మార్క్‌ఫెడ్‌ కార్యాలయ నూతన భవనాన్ని శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా …

Read More »

రహదారి భద్రత మన అందరి బాధ్యత

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత నియమ నిబంధనలపై అవగాహన కల్పించాలని రోడ్స్‌, రైల్వేస్‌ అడిషనల్‌ డిజిపి సందీప్‌ శాండిల్య అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం రహదారి భద్రత మన అందరి బాధ్యత అనే అంశంపై అవగాహన సదస్సులో మాట్లాడారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయని …

Read More »

డ్రోన్‌ ద్వారా పిచికారి చేయడం సులభం

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డ్రోన్‌ యంత్రం ద్వారా పురుగుమందులు పిచికారి చేయడం సులభమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద శుక్రవారం డ్రోన్‌ యంత్రం ద్వారా పురుగుమందులు పిచికారీ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. 7 నిమిషాల్లో ఎకరం పంటకు పురుగుమందులు పిచికారి చేయవచ్చని సూచించారు. మహిళా …

Read More »

ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం … ఒకరి పై మాల్‌ ప్రాక్టీస్‌ కేస్‌ నమోదు

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021-22 విద్యా సంవత్సర ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. మొత్తం 17,932 మంది విద్యార్థులకు గాను 793 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 17,139 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజ్‌ తెలిపారు. వీరిలో 15,740 మంది జనరల్‌ విద్యార్థులకు గాను 584 …

Read More »

సృజనాత్మకతను వెలికితీసే వేదిక కావాలి

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కళాభారతి ఆడిటోరియం భవనాన్ని శుక్రవారం రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడారు. సృజనాత్మకతను వెలికి తీసే వేదిక కళాభారతి కావాలని అని తెలిపారు. కామారెడ్డి ప్రజలకు గంప గోవర్ధన్‌ లాంటి నాయకులు దొరకడం …

Read More »

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021-22 విద్యా సంవత్సరం ఇంటర్‌ వార్షిక పరీక్షలకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రఘురాజ్‌ తెలిపారు. మే 6 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 35,522 మంది పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. వీరిలో మొదటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »