Blog Layout

రాజన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్‌ చైర్మన్‌

వేములవాడ, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొంది కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శైవక్షేత్రం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ మార్కుఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి గురువారం ఉదయం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. వీరి వెంట ఆలయ పర్యవేక్షకులు గుండి నరసింహ మూర్తి ఉన్నారు.

Read More »

కాంగ్రెస్‌ నుండి తెరాసలోకి…

ఆర్మూర్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి సమక్షంలో ఆలూర్‌ ఎస్‌ఎంసి చైర్మన్‌ వెల్మ గంగారెడ్డి, వార్డ్‌ మెంబెర్‌ మర్కంటి మహేష్‌, కాంగ్రెస్‌ ఎస్‌.సి.సెల్‌ నాయకుడు గొంగటి సురేందర్‌ తెరాస పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే వారి స్వగృహంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మనఊరు, మనబడి కార్యక్రమాన్ని చేపట్టి మొదటి విడతలో ఆలూర్‌ …

Read More »

దళితబంధుతో కుటుంబ స్థితిగతులు మెరుగుపడాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు పథకాన్ని లబ్దిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని తమ కుటుంబ స్థితిగతులను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. అట్టడుగున ఉన్న తమ వంశాన్ని ఉన్నత స్థితికి చేర్చాలనే కసితో కష్టపడి పని చేస్తే తప్పనిసరిగా లక్ష్యాన్ని సాధించగల్గుతారని అన్నారు. తద్వారా ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ప్రభుత్వ అభిమతం నెరవేరుతుందని, దళితబంధు పథకానికి …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఎనిమిది మంది డిబార్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదవ …

Read More »

బాలికల వసతి గృహంలో భోజనం చేసిన జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎక్లార బాలికల వసతి గృహంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని కోరారు. బిచ్కుంద ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Read More »

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కు ఐదుగురు విద్యార్థుల ఎంపిక

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ బేగంపేట్‌, రామంతపూర్‌లలో ఒకటో తరగతి ప్రవేశం కొరకు అర్హులైన గిరిజన విద్యార్థి, విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే ఆధ్వర్యంలో ఓ చిన్నారితో (లాటరీ) లక్కీడ్రా తీయించారు. ఇద్దరు బాలికలు, ముగ్గురు బాలురు మొత్తం ఐదుగురు …

Read More »

డిగ్రీ పరీక్షల్లో పదమూడు మంది విద్యార్థులు డిబార్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదవ, …

Read More »

రక్తదానంలో కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం..

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలలో ఆపరేషన్‌ నిమిత్తమై నిజాంసాగర్‌ మండలానికి చెందిన సుజాతకు కావలసిన ఓ పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో పట్టణానికి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టబోయిన స్వామి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి …

Read More »

30 నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లివర్‌ సమస్యతో బాధపడుతున్న బాధితుడికి వైద్య సహాయం నిమిత్తం ఆరోగ్యశ్రీ కార్డును ఆరోగ్యశ్రీ కలెక్టరేట్‌ అధికారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చంద్రమోహన్‌ చేతుల మీదుగా బాధితుని కుటుంబానికి అందజేశారు. జుక్కల్‌ మండలం పెద్ద ఏడిగి గ్రామానికి చెందిన దేవాడే నాగనాథ్‌ లివర్‌ సంబంధిత వ్యాధితో బాధ పడుతుండగా వారికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో కామారెడ్డి జిల్లా …

Read More »

సేంద్రియ ఎరువుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేంద్రియ ఎరువులు తయారు చేసి గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం పల్లె ప్రగతి పనులపై ఎంపీవోలతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు గ్రామాల్లో తడి, పొడి చెత్తను చెత్త బండి ద్వారా సేకరించి కంపోస్టు షెడ్‌కి తరలించాలని సూచించారు. పొడి చెత్తను వేరుగా విక్రయించాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »