Blog Layout

సర్వే పక్కాగా నిర్వహించాలి…

కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతం చేయాలనీ, పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో తక్కువ పనితీరు కనబరచిన మండల ప్రత్యేక అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సర్వే వేగవంతంతో పాటు నాణ్యత కలిగి ఉండాలని అన్నారు. గ్రామ పంచాయతీ వారీగా …

Read More »

ఉనికి కోసమే కాంగ్రెస్‌ పై కవిత అబద్దాలు

నిజామాబాద్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉనికి కోసం కల్వకుంట్ల కవిత అబద్ధాలు మాట్లాడుతుందని, ఏ ప్రభుత్వ హయాంలో క్రైమ్‌ రేట్‌ పెరిగిందో ఏ ప్రభుత్వ హయాంలో క్రైమ్‌ రేట్‌ తగ్గిందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమైతే మాతో చర్చకు రావాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మాణాల మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. …

Read More »

ఆర్జీలు పరిశీలించి చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోనీ ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానికి అర్జీలను కలెక్టర్‌ కు సమర్పించడం జరుగుతున్నది. అట్టి …

Read More »

ప్రజావాణికి 105 ఫిర్యాదులు

నిజామాబాద్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్‌ అంకిత్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌, …

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌ రూరల్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధుల నుండి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన సుమారు 15 మందికి సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు పంపిణీ చేశారు. పడకంటి మంగలి నడిపి గంగాధర్‌కు 60 వేలు, క్యాంప్‌ సార్‌ వన్‌కు 10 వేల 500, వన్నెల దివ్యకు 11 వేలు, రిక్కల బుదేవికి 9 వేలు, …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, డిసెంబరు 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య తెల్లవారుజామున 4.01 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల రాత్రి 12.31 వరకుయోగం : వృద్ధి రాత్రి 9.32 వరకుకరణం : చతుష్పాత్‌ మధ్యాహ్నం 3.48 వరకుతదుపరి నాగవం తెల్లవారుజామున 4.01 వరకు వర్జ్యం : ఉదయం 7.49 – 9.29మరల రాత్రి 10.51 …

Read More »

టీఎస్‌ఎస్‌ డబ్ల్యూజేఏ రాష్ట్ర అధ్యక్షులుగా కాదేపురం గంగన్న

బాన్సువాడ, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని బరంగ్‌ ఏడ్గి గ్రామానికి చెందిన కాదేపురం గంగన్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులుగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీర్కూర్‌ మండలంలో ఆంధ్రప్రభ, సూర్య, ప్రజాశక్తి, నమస్తే తెలంగాణ పత్రికలలో మండల స్థాయి విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం ఉదయం దిన పత్రికలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా …

Read More »

ఎమ్మెల్సీ కవితకు అపూర్వస్వాగతం

నిజామాబాద్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమ కేసులో అరెస్ట్‌, బెయిల్‌ పై విడుదల, న్యాయ పోరాటం వంటి పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘ కాలం తరువాత ఆదివారం నిజామాబాద్‌ వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి నిజామాబాద్‌ కు చేరుకున్న కవితకు డిచ్‌పల్లి వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ …

Read More »

జనరల్‌ స్టోర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఏర్పాటు..

కామారెడ్డి, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్‌ స్టోర్స్‌ అసోసియేషన్‌, బుక్‌ సెల్లర్స్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఏకగ్రీవంగా సభ్యులు తీర్మానించారు. ఆసోసియేషన్‌ అధ్యక్షలుగా కొమ్మ శ్రీనివాస్‌-గణేష్‌ జనరల్‌ స్టోర్స్‌ బుక్‌ సెల్లర్స్‌, ప్రధాన కార్యదర్శిగా- గంప సుధాకర్‌ తిరుమల జనరల్‌ స్టోర్స్‌ బుక్‌ సెల్లర్స్‌, కోశాధికారిగా గంప ప్రసాద్‌- కృష్ణ ప్రసాద్‌ …

Read More »

జనవరి 1 వరకు నవీపేట్‌ రైల్వే గేట్‌ మూసివేత

నిజామాబాద్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరమ్మతులు కొనసాగుతున్న దృష్ట్యా నవీపేట వద్ద గల 188 నెంబర్‌ లెవెల్‌ క్రాసింగ్‌ రైల్వే గేటును 2025 జనవరి 1వ తేదీ వరకు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ బీ.శ్రీనివాస్‌ తెలిపారు. మరమ్మత్తు పనుల కారణంగా ఈ నెల 26 ఉదయం 7.00 గంటల నుండి రైల్వే గేటు మూసివేయబడినదని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »