Blog Layout

రాజీవ్‌ స్వగ ృహ ప్లాట్లకు హద్దులు నిర్ధారణ

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అడ్లూర్‌ గ్రామ శివారులో గల రాజీవ్‌ స్వగృహ పథకానికి సంబంధించిన ప్లాట్లకు హద్దులు గుర్తించామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఆదివారం రాజీవ్‌ స్వగృహ పథకం ప్లాట్లను, గృహాలను పరిశీలించారు. గృహాల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని అధికారులకు సూచించారు. ప్లాట్లకు నెంబర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ …

Read More »

బాలికలకు ఆత్మరక్షణకోసం కరాటే తప్పనిసరి

వేములవాడ, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలకు ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతో అవసరమని వేములవాడ అర్బన్‌ ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు అన్నారు ఆదివారం వేములవాడ పట్టణంలోని బింగి మహేష్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఓకి నవాకరాటే అకాడమీ విద్యార్థులకు బెల్ట్‌ గ్రేడిరగ్‌ పరీక్ష నిర్వహించారు. దాదాపు 50 మంది విద్యార్థులు బెల్ట్‌ పోటీలలో ప్రతిభ కనబర్చగా వారికి బెల్టు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య …

Read More »

అసభ్యకరమైన పోస్ట్‌ పెడితే లక్ష రూపాయలు జరిమానా

డిచ్‌పల్లి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో షీ టీం, నిజామాబాద్‌ సౌజన్యంతో డైరెక్టర్‌ డా. కె. అపర్ణ ఆదివారం ‘‘సైబర్‌ నేరాలు – మహిళా సంరక్షణ’’ అనే అంశం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో షీ టీం, నిజామాబాద్‌ మహిళా కానిస్టేబుల్స్‌ పి. రేఖా రాణి, టి. హరితా రాణి వర్చువల్‌ వేదికగా ఆన్‌ లైన్‌లో హాజరై …

Read More »

కామారెడ్డి జిల్లా జెఆర్‌సి, వైఆర్‌సి కోఆర్డినేటర్‌గా బాలు

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జూనియర్‌ రెడ్‌ క్రాస్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌ కో ఆర్డినేటర్‌గా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు, సేవాతత్పరతను గుర్తించి బాలును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గత 14 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా 65 సార్లు, కరోనా సమయంలో 980 యూనిట్ల రక్తాన్ని, 100 యూనిట్ల ప్లాస్మాను, రక్తదాతల సమూహం ద్వారా 10వేల యూనిట్లకు పైగా రక్తాన్ని …

Read More »

బాపూజీకి ఘన నివాళి

ఆర్మూర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మహాత్మా గాంధీ 74వ వర్ధంతి సందర్బంగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్‌ఎస్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు పూజ నరేందర్‌ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెరాస సీనియర్‌ నాయకులు పోల సుధాకర్‌, పండిత్‌ ప్రేమ్‌, పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్‌ మాట్లాడుతూ భారతదేశానికి శాంతి అహింస మార్గాలతో దేశభక్తి నినాదాలతో భారతదేశ పౌరులను …

Read More »

కలెక్టరేట్‌లో షహీద్‌ దివస్‌

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకుంటూ ఆదివారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో షహీద్‌ దివస్‌ నిర్వహించారు. దేశానికి ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుండి విముక్తి కల్పించేందుకు పోరాడుతూ అసువులు బాసిన స్వాతంత్ర సమరయోధులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన మహనీయులను …

Read More »

వాటర్‌ ప్లాంట్‌ కోసం ఆర్థిక సాయం

వేములవాడ, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిమ మీ ముంగిట్లో అనే నినాదంతో ప్రతిమ ఫౌండేషన్‌ అద్వర్యంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేములవాడ అర్బన్‌ 20 వ వార్డ్‌ కౌన్సిలర్‌ రేగుల సంతోష్‌ బాబు గత నెల ఉచిత వాటర్‌ ప్లాంట్‌ కొరకు అభ్యర్ధన పత్రం అందజేశారు. దానికి సానుకూలంగా స్పందించి ఉచిత వాటర్‌ ప్లాంట్‌ కోసం అవసరం అయ్యే మొత్తం …

Read More »

ఉద్యోగాలు వెంటనే భర్తీచేయాలి…

బోధన్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు బోధన్‌ నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు బోధన్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టిడిరచారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయక నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని, నిరుద్యోగ భృతి ఇస్తాం అని మూడు సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు దాని ఉసే …

Read More »

ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రగతిభవన్‌లో శనివారం ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ సమావేశమై ధరణి పెండిరగ్‌ దరఖాస్తుల విషయమై సమీక్షించారు. ఎన్ని దరఖాస్తులు ఏయే విభాగంలో పెండిరగ్‌లో ఉన్నాయి, వాటి పరిష్కారానికై చేపడుతున్న చర్యలు ఏమిటీ, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న దరఖాస్తులు …

Read More »

డ్రాప్‌ బాక్స్‌ వినియోగించుకోవాలి

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వ్యాప్తి దృష్ట్యా, ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయడమయ్యిందని కలెక్టర్‌ సీ.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడిరచారు. అయితే ప్రజల సౌకర్యార్థం, వారి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »