Blog Layout

25న చెక్కుల పంపిణీ

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 25న మంగళవారం ఉదయం 11 గంటలకు ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గంలోని చిరు వ్యాపారులకు రూ. 50 వేల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేయనున్నారని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దయానంద్‌ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, మున్సిపల్‌ …

Read More »

దోమకొండ మండల సమాఖ్యకు ట్రాక్టర్‌ అందజేత

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల పరిషత్‌ కార్యాలయం అవరణలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో వ్యవసాయ ఆధునిక పరికరాల అద్దె కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం సబ్సిడీపై మండల సమాఖ్యకు మంజూరు చేసిన ట్రాక్టర్‌ను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు.

Read More »

గ్రామాల వారిగా అర్హుల పేర్లు నమోదు చేయాలి…

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల వారీగా దళిత బంధు పథకం కోసం అర్హులైన లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఈనెల 25లోగా పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల సంఖ్యను గుర్తించి జిల్లా స్థాయి అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. …

Read More »

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి…

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు బాల, బాలికలను సమానంగా చూడాలని సూచించారు. బాలికలు తమకు నచ్చిన లక్ష్యాన్ని …

Read More »

రిపబ్లిక్‌ డే ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సోమవారం గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. జాతీయ జెండా ఏర్పాటు చేయవలసిన స్థలాన్ని చూశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Read More »

ఆదాయ పన్ను పరిమితి పెంచాలి!

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరిలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ నందు మధ్య తరగతి ఉద్యోగుల పన్ను పరిమితిని పది లక్షలకు పెంచాలని, పెన్షనర్లకు ఎలాంటి ఆదాయం లేనందున ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయించాలని, ఆదివారం జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌, రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా కమిటీ సమావేశం డిమాండ్‌ చేసింది. …

Read More »

రేపటి ప్రజావాణి రద్దు

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 24న సోమవారం కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి, కేసులు పెరుగుతున్న దృష్ట్యా 24న సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని …

Read More »

హోరాహోరీగా క్యారం క్రీడా పోటీలు

భీమ్‌గల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ పట్టణ స్థాయి వేముల సురేందర్‌ రెడ్డి స్మారక క్యారం టోర్ని రెండవ రోజు ఆదివారం కూడా కొనసాగింది. హోరా హోరీగా మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. సింగిల్స్‌లో ఫ్రీ క్వాటర్‌ ఫైనల్లో జెజె శ్యామ్‌, ఫెరోజ్‌ పై విజయం సాధించారు. సింగిల్స్‌లో మొత్తం 40 మంది క్రీడాకారులు పోటీలో తలపడనున్నారని నిర్వాహకులు మందుల హన్మాండ్లు, కంకణాల రాజేశ్వర్‌ తెలిపారు. ఆదివారం …

Read More »

ఘనంగా నేతాజీ జయంతి

గాంధారి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేతాజీ సుభాష్‌ చంద్రభోస్‌ 125 వ జయంతి వేడుకలను గాంధారి మండలంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని సుభాష్‌ చంద్రభోస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఈ సందర్బంగా స్థానిక యువజన నాయకుడు, వార్డ్‌ మెంబర్‌ నితిన్‌ పాటిల్‌ మాట్లాడుతూ బ్రిటిష్‌ బానిసత్వపు చీకట్లో మగ్గుతున్న భారతీయ యువతను సైనికులుగా మార్చి …

Read More »

కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ సీ.నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజల సౌకర్యార్థం, వారి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »