Blog Layout

శ్రీ నిధి ఎక్స్‌గ్రేషియా అందజేసిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెర్ప్‌ సమన్వయకర్త ఆలే శ్రీనివాస్‌ పిట్లం మండలంలో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాల వల్ల ఆగస్టు 31,2021 న మృతి చెందారు. శ్రీ నిధి ద్వారా రూ.1.50 లక్షల ఎక్స్‌ గ్రేషియా మంజూరైంది. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, శ్రీనివాస్‌ భార్య నాగజ్యోతికి మంగళవారం చెక్కును అందజేశారు. సెర్ప్‌ సిబ్బంది ఏదైనా కారణం చేత మృతి చెందితే …

Read More »

టీయూ వీసీకి వైశ్య వికాసం డైరీ బహూకరణ

డిచ్‌పల్లి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌కు వాసవి గ్రూప్‌ ఆఫ్‌ చైర్మన్‌ యర్రం విజయ్‌ కుమార్‌ వైశ్య వికాసం డైరీని మంగళవారం వీసీ చాంబర్‌లో బహూకరించారు. నాగరాజు డైరీని వీసీకి అందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వాసవి క్లబ్‌ వారు వివిధ సామాజిక, సాంస్కృతిక సేవా రంగాలలో విస్తృతమైన సేవలందిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే వారి …

Read More »

టీయూలో జాతీయ బాలికల దినోత్సవం

డిచ్‌పల్లి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉమెన్‌ సెల్‌ ఆధ్వర్యంలో డైరెక్టర్‌ డా. కె. అపర్ణ సోమవారం సాయంత్రం వర్చువల్‌ వేదికగా ఆన్‌లైన్‌ లో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ విశ్వవిద్యాలయ మహిళా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీల్లో చాలా మంది విద్యార్థులు చిత్రాలు గీసి ఆన్‌లైన్‌లో ప్రదర్శించారు. అందులో హరిప్రియ, యోగిత, ద్యాగలి సాత్త్విక, …

Read More »

దళిత కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయం

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో మంగళవారం చిరు వ్యాపారులకు ఉచిత రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గం లో 110 మంది చిరు వ్యాపారులకు యాభై వేల రూపాయల చొప్పున ఉచితంగా ప్రభుత్వం రుణాలను …

Read More »

సెమీఫైనల్‌కు చేరిన క్యారం క్రీడలు

భీమ్‌గల్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌కు చెందిన రాష్ట్ర రైతు నాయకుడు దివంగత వేముల సురేందర్‌ రెడ్డి భీమ్‌గల్‌ పట్టణ స్థాయి క్యారం క్రీడలు మంగళవారానికి సెమీఫైనల్‌కు చేరాయని నిర్వాహకులు మందుల హన్మాండ్లు, కంకణాల రాజేశ్వర్‌ అన్నారు. సింగిల్స్‌లో శ్రీనివాస్‌ వర్సెస్‌ నిసార్‌ ఫైనల్‌ చేరుకున్నారు. డబుల్స్‌లో జె.జె. శ్యాం, నిసార్‌, బబ్లూ, ఫెరోజ్‌, అఫ్రోజ్‌, శ్రీనివాస్‌, ఇబ్రహీం, …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కు అందజేత

వేల్పూర్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంసాహెబ్‌ పేట్‌ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసర్పంచ్‌ సుధాకర్‌ గౌడ్‌ మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి చెక్కు మంజూరుకు కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Read More »

ఓటు హక్కు పవిత్రమైంది

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు హక్కు పవిత్రమైందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కును ప్రతి ఎన్నికల్లో వినియోగించుకోవాలని కోరారు. కొత్త ఓటర్లకు ధన్య వాదాలు తెలిపారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఓటు …

Read More »

వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలి…

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో మంగళవారం జ్వరం సర్వేను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ లక్షణాలున్నవారికి మందుల కిట్‌ అందజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కోరారు. వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. 15 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కోవిడ్‌ …

Read More »

పట్టణ మైనారిటీ కమిటీ ఏర్పాటు..

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ బీజేపీ మైనారిటీ మోర్చా కమిటీని పట్టణ అధ్యక్షుడు నేహల్‌ ఏర్పాటు చేశారు. అనంతరం పట్టణ మైనారిటీ మోర్చా నూతన కమిటీ సభ్యులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కమిటీ సభ్యులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఏ ఒక్క …

Read More »

నూతన కార్యవర్గం ఏర్పాటు

ఆర్మూర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఆర్మూర్‌ రూరల్‌ మండల రేషన్‌ డీలర్ల సమావేశం పెర్కిట్‌ ఎం.ఆర్‌. గార్డెన్స్‌లో జరిగింది. సమావేశంలో ఆర్మూరు రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆర్మూరు మండల రూరల్‌ అద్యక్షులుగా మల్లెల గంగారాం (మచ్చర్ల), ప్రధాన కార్యదర్శిగా కామని నరేష్‌ (పేర్కిట్‌), ఉపాధ్యక్షులుగా అబ్దుల్‌ అజీమ్‌ (పేర్కిట్‌), కోశాధికారిగా సుద్దపల్లి సురేష్‌ (మామిడిపల్లి), సలహాదారుగా లింగమయ్య …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »