ఆర్మూర్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్బన్ అటవీ పార్క్ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆమె పలు కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. మాక్లూర్, జక్రాన్‌పల్లి, ఆర్మూర్ మండలాలలో పర్యటించారు. మాక్లూర్ అర్బన్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులు మార్చి నాటికి పూర్తి …
Read More »Blog Layout
మున్సిపల్ కార్మికుల వంటా వార్పు
నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా ఐ.ఎఫ్.టి.యు, సిఐటియు, ఎఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ధర్నా చౌక్‌లో మున్సిపల్ కార్మికులు రోడ్డుపైనే వంటలు చేసికొని భోజనాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా …
Read More »20 లోగా ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 20లోగా జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం సహకార, పౌర సరఫరా సంస్థల అధికారులతో దాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సహకార కేంద్రాల వారీగా ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి …
Read More »ఇంధన పొదుపుపై అవగాహన
నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్ రెడ్‌కో గురువారం జిల్లా పరిషత్ నిజామాబాద్ ఆవరణలో ఇంధన పొదుపుపై అవగాహన డెమో స్టాల్ ఏర్పాటు చేశారు. దీనిలో ప్రజలకి ఇంధన పొదుపు పై, సోలార్ వాడకంపై అవగాహన కల్పించారు. స్టాల్‌ను జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, జెడ్‌పిటిసిలు తదితరులు సందర్శించారు. వీరికి టీఎస్ …
Read More »కొత్త కలెక్టరేట్ పరిశీలించిన ప్రియాంక వర్గీస్
నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కొత్త కలెక్టరేట్‌లో సదుపాయాలను, సౌకర్యాలను, హరితహారం మొక్కలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎక్కడ లేని విధంగా కొత్త కలెక్టరేట్‌లో ఆకర్షణీయంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటించారని ప్రశంసించారు. గార్డెన్‌లో కొన్ని రకాల అందమైన పూల మొక్కలు పెట్టించాలని సూచించారు. …
Read More »కూరగాయల పంటలు సాగు చేయాలి…
కామారెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనంను చిట్టడవిలా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బాన్సువాడ మండలం తిరుమలాపూర్‌లో బుధవారం బృహత్ పల్లె ప్రక ృతి వనంను పరిశీలించారు. వనంలో కానుగ, రావి, మద్ది, చింత, గోరింటాకు, టేకు వంటి మొక్కలను నాటాలని సూచించారు. చౌడు నేలలు ఉన్నందున వ్యవసాయ అధికారులతో భూసార పరీక్షలు చేయిస్తామని చెప్పారు. …
Read More »నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నస్రుల్లాబాద్ మండలం అంకుల్ క్యాంపులో బుధవారం వైకుంఠధామం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. కంపోస్ట్ షెడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని కోరారు. బీర్కూర్‌లో బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాజా గౌడ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
Read More »రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జ్యుడిషియల్ మెంబర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లో బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జ్యుడిషియల్ మెంబర్ ఎన్. ఆనందరావుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మొక్కను అందించారు. హైదరాబాద్ నుంచి బాసర్ వెళ్తున్న ఆయనకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శీను, తహసిల్దార్ ప్రేమ్ కుమార్ ఉన్నారు.
Read More »వైశ్యుల త్యాగ నిరతిని దేశానికి చాటిచెప్పిన మహనీయుడు పొట్టి శ్రీరాములు
కామారెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొట్టిశ్రీరాములు 69వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల త్యాగనిరతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఆర్యవైశ్యుల …
Read More »యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి
గాంధారి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే యాసంగిలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం గాంధారి మండలంలో పర్యటించిన కలెక్టర్ తిమ్మాపూర్ గ్రామంలో రైతులతో ముచ్చటించారు. యాసంగిలో రైతులు ఆరుతడి పంటలలు వేసుకొని లాభాలు పొందవచ్చని అన్నారు. సూర్యపువ్వు, పెసర, శనగ పంటలు వేయడం ద్వారా అధిక దిగుబడి వచ్చి రైతులు …
Read More »