Blog Layout

18న చలో రాజ్‌భవన్‌

కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 18వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో చలో రాజ్‌ భవన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ రావ్‌ తెలిపారు. నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్‌ భవన్‌ వరకు ప్రదర్శనగా వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. …

Read More »

సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపిన ఉపాధ్యాయులు

బాన్సువాడ, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్పిలను, సమగ్ర శిక్ష ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోనాపూర్‌ కాంప్లెక్స్‌ ఉపాధ్యాయులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అయ్యాల సంతోష్‌ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీలకు పే స్కేల్‌ వేతనంతోపాటు ఆరోగ్య భీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో …

Read More »

సౌదీలో హింసిస్తున్నారు.. వాపస్‌ తెప్పించండి !

హైదరాబాద్‌, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిద్దిపేట జిల్లా ఇరుకోడు గ్రామానికి చెందిన గోల్కొండ రాజవర్ధన్‌ రెడ్డి సౌదీ అరేబియాలోని హాయిల్‌ ప్రాంతంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకున్నాడని రక్షించి వాపస్‌ తెప్పించాలని అతని తల్లి లక్ష్మి వేడుకుంటున్నారు. మంగళవారం హైదరాబాద్‌ బేగంపేట ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో ఈమేరకు ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె వెంట గల్ఫ్‌ కార్మిక సంఘం నాయకులు మంద భీంరెడ్డి, …

Read More »

ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

బోధన్‌, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న మొబైల్‌ యాప్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. బోధన్‌ పట్టణంతో పాటు, రుద్రూర్‌ మండలం సులేమాన్‌ నగర్‌ లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్‌ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వేయర్లు ఇంటింటికీ …

Read More »

ఇందిరమ్మ ఇళ్ళ సర్వే పక్కాగా నిర్వహించాలి

కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్ళ సర్వేను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం బిక్నూర్‌ మండలం అంతంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ళ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, లబ్ధిదారురాలు పూర్తి సమాచారాన్ని సేకరించి యాప్‌లో పొందుపరచాలని తెలిపారు. ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లుతో పాటు …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 17, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 12.22 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పునర్వసు తెల్లవారుజామున 3.00 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 11.51 వరకుకరణం : గరజి మద్యాహ్నం 12.22 వరకు తదుపరి వణిజ రాత్రి 9.41 వరకు వర్జ్యం : మద్యాహ్నం 3.01 – 4.37దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

గ్రూప్‌ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్‌ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌. గ్రూప్‌ 2 రెండవ రోజున జరిగిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ సోమవారం రోజున తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటుచేసిన మౌలిక సదుపాయాలు త్రాగునీరు, విద్యుత్‌, టాయిలెట్స్‌, మెడికల్‌ సేవలు పై చీఫ్‌ …

Read More »

రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించాలి…

కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ 2024 జిల్లా స్థాయి పోటీలను కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ 2024 సందర్భంగా జిల్లాలో గ్రామీణ, మండల …

Read More »

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి…

కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ జీ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, అంగన్‌ వాడీ భవనాలు, తదితర సమస్యలపై అర్జీలను దరఖాస్తు దారులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన అర్జీలను …

Read More »

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 94 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, డీఆర్డీఓ సాయాగౌడ్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »