Blog Layout

రక్తదాన శిబిరం విజయవంతం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి కేంద్రంలో మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు, రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా సెక్రటరీ రాజన్న పేర్కొన్నారు. ఎల్లారెడ్డి కేంద్రంలో ముస్లిం యువకులు మొట్టమొదటిసారిగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన మాజీ జడ్పిటిసి గయాజోద్ధిన్‌, …

Read More »

మహాత్మా! జిల్లా ప్రజా ప్రతినిధుల కళ్ళు తెరిపించండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌.ఎస్‌.యు.ఐ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఓ మహాత్మా ! జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధుల కళ్ళు తెరిపించండని కోరారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు వరద బట్టు వేణురాజు మాట్లాడుతూ జిల్లాకు తలమానికంగా ఉన్న డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీలో అక్రమనియామకాలు, కోట్లల్లో అవినీతి జరుగుతున్నా …

Read More »

ధాన్యం కుప్పలు, ప్రయాణికులకు తిప్పలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అంటే ధాన్యసిరులకి పెట్టింది పేరు. కొన్ని వేల హెక్టార్లలో అన్నదాతలు ధాన్యాబాండాగారాన్ని పండిస్తున్నారు. అయితే గత వారం పది రోజుల నుండి వరికోతలు ప్రారంభమవ్వడంతో అన్నదాతలు కోతలతో బిజీ అయ్యారు. కోసిన వడ్లు రోడ్లపై ఆరబెట్టడంతో ఇటు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయాలలో రోడ్డుపై పోసిన వడ్లధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో ప్రమాదాలు సైతం …

Read More »

రాష్ట్రస్థాయిలో కామారెడ్డికి గుర్తింపు

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌లో జరిగిన స్టేట్‌ సీనియర్‌ ఇంటర్‌ జిల్లాల రగ్బీ టోర్నమెంట్‌లో కామారెడ్డి జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ క్రీడాకారులను అభినందించారు. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గుర్తింపు తేవడం అభినందనీయమని కొనియాడారు.

Read More »

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం ఆయన క్యాంప్‌ కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్‌ …

Read More »

రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి..

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కార్యాలయాలలో రికార్డులు సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం స్వఛ్ఛ డ్రైవ్‌లో భాగంగా పలు కార్యాలయాలను సందర్శించారు. సెల్ఫ్‌లో రికార్డులు భద్రంగా పెట్టాలని సూచించారు. కార్యాలయాల్లో ఉన్న అవసరం లేని పేపర్లను తొలగించాలని పేర్కొన్నారు. చెడిపోయిన ఎలక్ట్రానిక్‌ వస్తువులను తొలగించే విధంగా చర్యలు …

Read More »

వంద శాతం వ్యాక్సినేషన్‌ చేయించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఆరోగ్య, ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలు గ్రామాల్లో క్షేత్ర పర్యటన చేపట్టి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని కోరారు. అర్హత గల అసంఘటిత రంగ …

Read More »

రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి కేంద్రంలో ఈద్‌ మిలాద్‌ ఉన్‌ నబీ పండుగను పురస్కరించుకొని కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. కరోణ వ్యాక్సినేషన్‌ కారణంగా రక్త నిల్వలు లేకపోవడం వల్ల రక్తదాన కేంద్రాల్లో ఆపదలో ఉన్నవారికి రక్తం లభించక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని, కావున యువకులందరూ మంగళవారం …

Read More »

మాస్‌ కాపీయింగ్‌కు సిద్ధమవుతున్న కాలేజీలు…

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు 25తేది నుండి ప్రారంభం కాబోతున్న సందర్భంగా జిల్లాలోని కొన్ని ప్రవేటు కళాశాలలు మాస్‌ కాపీయింగ్‌ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న విషయం ఏబివిపి దృష్టికి వచ్చిందని కాగా కామారెడ్డి జిల్లా కన్వినర్‌ బాను ప్రసాద్‌ అధ్వర్యంలో సోమవారం నోడల్‌ అఫీసర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎబివిపి నాయకులు మాట్లాడుతు కొన్ని కళాశాలలు …

Read More »

కామారెడ్డి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా స్వాతి

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వికారాబాద్‌ జిల్లా చేవెళ్ల నుంచి బదిలీపై వచ్చిన కామారెడ్డి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం ఏం స్వాతికి కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ సోమవారం స్వాగతం పలికింది. ఈ మేరకు పదవీ బాధ్యతలు చేపట్టిన జడ్జికి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి కోర్టు చాంబర్‌లో పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. బార్‌ అసోసియేషన్‌ సంపూర్ణ సహకారం ఉంటుందని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »