నవీపేట్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని నిజాంపూర్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన సామూహిక కుంకుమ అర్చన, హోమం, పంచాభిషేకాలతో ప్రతేక్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహా బిక్ష, అన్నదానం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా అమ్మవారి సేవలో గ్రామ ప్రజలు, యూత్ …
Read More »Blog Layout
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
బోధన్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం కష్ట పడి పండిరచిన పంటలకు ప్రభుత్వం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో ప్రయివేట్ దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్ట పోతున్నారని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసి బోధన్ డివిజన్ కార్యదర్శి కే. గంగాధర్ అన్నారు. తుపాన్ మూలంగా భారీగా కురిసిన వర్షాలతో పంటలన్ని నీట మునిగాయని అలా నష్టపోయిన రైతులు పంటను నూర్పిడి చేసి …
Read More »సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగా పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే …
Read More »కంపోస్ట్ షెడ్లు వినియోగించాలి…
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతిలో చేపట్టిన కంపోస్ట్ షెడ్లు వినియోగించి పంచాయతీల ఆదాయాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. మంగళవారం ఆయన గాంధారి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైకుంఠ ధామాలు అన్ని గ్రామాల్లో వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఊట చెరువుల …
Read More »వ్యాక్సిన్ తీసుకున్న వారికి సన్మానం…
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర, బీసీ కాలనిలో వైద్య శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది మంగళవారం ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ చేశారు. వ్యాక్సినేషన్ వేయించుకొని వారింటికి వెళ్లి కలెక్టర్ వారితో చర్చించి వ్యాక్సినేషన్ వేయించుకునే విధంగా …
Read More »కలెక్టర్ స్వయంగా వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు….
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డిలో మంగళవారం ఇంటింటికి తిరుగుతూ వైద్య సిబ్బంది కొవిడ్ వ్యాక్సినేషన్ చేశారు. వ్యాక్సినేషన్ వేయించుకొని ఓ కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చర్చించి వ్యాక్సినేషన్ వేయించుకునే విధంగా అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కుటుంబంలోని ఐదుగురికి వ్యాక్సిన్ వేయించారు. 95 ఏళ్ల వృద్ధురాలు అఫీజాబేగంకు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. కొవిడ్ …
Read More »పంట రుణాల మంజూరులో మంచి ప్రోగ్రెస్, అభినందనలు
నిజామాబాద్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారి ప్రజలను రైతులను ఎన్నో విధాలుగా బాధించినప్పటికీ బ్యాంకర్లు అండగా ఉండి రుణాల మంజూరులో మంచి ప్రోగ్రెస్ సాధించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. సెప్టెంబర్‌తో ముగించే రెండవ త్రైమాసిక ముగింపును పురస్కరించుకొని బ్యాంకర్ల డిసిసి, డిఎల్‌ఆర్‌సి సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ …
Read More »న్యాయవ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకం
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయవ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమని కామారెడ్డి జిల్లా జడ్జి రమేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాలులో బదిలీపై వెళ్తున్న ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి రాజ్‌కుమార్ వీడ్కోలు సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అదనపు జిల్లా జడ్జి రమేష్ బాబు మాట్లాడుతూ, న్యాయమూర్తులు జూనియర్ న్యాయవాదులకు అండగా నిలవాల్సిన అవసరముందన్నారు. ప్రతి …
Read More »పూసల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
ఆర్మూర్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ అన్నపూర్ణ కాలనీలో సోమవారం పూసల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సంఘ భవనం వద్ద మహిళలు ఆటపాటలతో బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మకు పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని సంఘ అధ్యక్షుడు మద్దినేని నరేష్ తెలిపారు. కార్యక్రమంలో మహిళలు నాగమణి, పొదిల లత, …
Read More »ఎల్‌ఐసి ఏజెంట్‌ల నూతన కార్యవర్గం ఎన్నిక
ఆర్మూర్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్‌లో ఎల్‌ఐసి ఏజెంట్‌ల నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ఇందులో భాగంగా జోనల్, డివిజన్ నాయకులు, ఆర్మూరు బ్రాంచ్‌కు సంబంధించిన దాదాపు 150 మంది ఏజెంట్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర, జాతీయ నాయకులు హాజరై ఏజెంట్ల సమస్యలు, పాలసీదారుల నూతన పాలసీలు తదితర విషయాలు చర్చించారు. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో …
Read More »