కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఇ.వి.ఎమ్ గోడౌన్ నిర్మాణం పనులను బుధవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారును ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రాజేశ్వర్ రెడ్డి, ఈఈ రవిశంకర్, డిఈ శ్రీనివాస్, జెఈఈ రవితేజ, తహసిల్దార్ ప్రేమ్ కుమార్ ఉన్నారు.
Read More »Blog Layout
కామారెడ్డి జడ్పి సమావేశం
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జడ్పీ చైర్ పర్సన్ శోభ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లా పరిషత్ సమావేశం జడ్పీ చైర్ పర్సన్ శోభ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ …
Read More »వ్యాక్సినేషన్ కోసం ఇంటింటి సర్వే చేపట్టాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 100 శాతం అయ్యే విధంగా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్ జితీష్ వి పాటిల్ ఆదేశించారు. బుధవారం వైద్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ప్రతిరోజు ఒక ఎఎన్‌ఎం వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటా సర్వే చేపట్టి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయాలని …
Read More »లబాన్ లంబాడాల పోస్టుకార్డు ఉద్యమం
గాంధారి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర లబాన్ లంబాడాలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని గిరిజనులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్బంగా గాంధారి మండలంలో బుధవారం పలు తండాలలో లబాన్ లంబాడా గిరిజనులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పంపించేందు పోస్ట్ కార్డులను సేకరించారు. పోస్ట్ కార్డుల రూపంలో తమ విన్నపాన్ని, ఆవేదనను ముఖ్యమంత్రికి చేరేవిధంగా ఒకే సారి కార్డులను పంపిస్తున్నామని లబాన్ లంబాడా …
Read More »20వ వార్డులో రోడ్ల మరమ్మతులు
ఆర్మూర్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం పెర్కిట్ 20వ వార్డులో ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా రోడ్లను పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలు కావడంతో వాటి మరమ్మతు పనులు దగ్గరుండి చేయించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read More »అధికారులు స్కూల్స్ తనిఖీ చెయ్యాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్కూల్స్ ప్రారంభం అయినందున పాఠశాలల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోన నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు పాఠశాలల్లో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్సులో పాఠశాలలు తనిఖీ, గణేష్ నిమజ్జనం, అధిక వర్షాలు, హరితహారం, ఫారెస్ట్‌పై సమీక్షించారు. జిల్లా …
Read More »తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం
వేల్పూర్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో సుంకేట్ శ్రీనివాస్ గౌడ్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత వైకుంఠ రథాన్ని గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జమున మాట్లాడుతూ సుంకేట్ శ్రీనివాస్ గౌడ్ వారి తల్లిదండ్రులు నర్సాగౌడ్ గంగుబాయి జ్ఞాపకార్థం ఉచిత వైకుంఠ రథం గ్రామ పంచాయతీకి అందజేశారని, వారి తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ తీగల …
Read More »గురువారం నుంచి 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి డోర్ టూ డోర్ సర్వే నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌తో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్ పై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »27న భారత్ బంద్
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు వ్యతిరేక 3 చట్టాల రద్దుకై ఈనెల 27న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకెఎస్‌సిసి) ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా భాద్యులు వి.ప్రభాకర్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక మూడు చట్టాలను విద్యుత్ సవరణలను రద్దు చేయాలన్నారు. పంటలకు కనీస మద్దతు …
Read More »జిల్లా జైలు తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి….
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం స్థానిక సారంగపూర్‌లోని నిజామాబాద్ జిల్లా జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జే విక్రమ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలు పరిశీలించారు, రిమాండ్ ఖైదీలను వివరాలను అడిగి తెలుసుకొని వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా అందించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ …
Read More »