Blog Layout

పల్లె ప్రగతి కొరకు గ్రామ సభ

మోర్తాడ్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో గురువారం గ్రామ సర్పంచ్‌ బోగ ధరణి ఆనందు అధ్యక్షతన పల్లె ప్రగతి గ్రామాల అభివృద్ధి పై గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో వచ్చే పది రోజులలో గ్రామంలో జరపాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామంలో అండర్‌ డ్రైనేజీ నూతన విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు చేయాలని …

Read More »

పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి

వేల్పూర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌ ఏనుగు శ్వేతా గంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలో శాఖల వారీగా ఏ అవసరాలు ఉన్నాయి అనేదానిపై సంబంధిత అధికారులతో చర్చించారు. గ్రామంలో ఇప్పటివరకు గుర్తించిన పనులను సర్పంచ్‌ శ్వేతా గంగారెడ్డి చదివి వినిపించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో …

Read More »

కరోనా కాలంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి

వేల్పూర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్స్‌ డే సందర్భంగా వేల్పూర్‌ మండలం పడగల గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆరోగ్య ఉప కేంద్రంలో వైద్య సిబ్బందిని పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు రమేష్‌ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రాత్రి పగలు గ్రామ ప్రజలకు వైద్య సిబ్బంది సేవలు అందించారని, వారి సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివని అన్నారు. గ్రామంలో వైద్య …

Read More »

పల్లెప్రగతిలో మంత్రి, కలెక్టర్‌…

వేల్పూర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వేల్పూరు మండల కేంద్రంలో జంబి హనుమాన్‌ వద్ద బతుకమ్మ పార్కు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామంలో అన్ని వసతులు కల్పించడమే …

Read More »

7 నుంచి ప్రాక్టికల్స్‌

డిచ్‌పల్లి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను ఈ నెల 7 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్‌ విడుదల చేశారు. పరీక్షలు మొదటి విడుత ఈ నెల …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసాన్ని పెంచాము…

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహించడం చాలా సంతృప్తికరంగా ఉందని ముఖ్యంగా కోవిడ్‌ సందర్భంలో ఆసుపత్రికి వచ్చిన రోగులకు అంకితభావంతో చికిత్స అందించామని ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసాన్ని పెంచామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ అన్నారు. డాక్టర్స్‌ డే సందర్భంగా హరిదా రచయితల సంఘం తమను గౌరవించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందన్నారు. రచయితలు అంటే ప్రజలలో ధైర్యాన్ని తమ …

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం సాహెబ్‌ పేట్‌ గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును గ్రామ సర్పంచ్‌ సుధాకర్‌ గౌడ్‌ ఉపసర్పంచ్‌ లక్ష్మణ్‌ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న శకుంతల పరిస్థితి బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం 18 వేల రూపాయల చెక్కు …

Read More »

ఏడో విడత హరితహారం ప్రారంభించిన సర్పంచులు

నందిపేట్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని గ్రామాలలో ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచుల అధ్యక్షతన గురువారం ప్రారంభమయింది. గ్రామాల్లో ఇది వరకె ఉపాధి కూలీల ద్వారా తవ్వించి సిద్ధంగా ఉంచిన గుంతలలో ప్రజా ప్రతినిధులు అధికారులు మొక్కలు నాటి నీరుపోశారు. డొంకేశ్వర్‌ గ్రామ సర్పంచ్‌ ఛాయా చందు, ఎంపిటిసి శ్రీకాంత్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలను …

Read More »

నేటినుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో వివిధ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) తొలివిడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 15 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశమున్నది. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.200 చెల్లించాలి. ఈనెల 3 నుంచి 16 వరకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

భాస్కరులవ్వండి

భరతమాత బిడ్డలారభాస్కరులయి ప్రకాశించిప్రపంచాన భరతఖ్యాతిప్రభలను వెదజల్లండి వారసత్వ సంపదలగుశాస్త్రంబుల జ్ఞాన మందిదశదిశలా చాటి చెప్పుధర్మమాచరించ లెండి. మహోమహుల చరిత లెరిగిభవిత బాటన్నడవండిమాతృ రుణము దీర్చుకొనగమణి దీపిక లవ్వండి. తనువు మనము లెల్లెడలాత్యాగ నిరతి నమరు కొనగధైర్య సాహసముల తోడధీరులుగా చెలగండి. దేశమే నా దేహమంటుమహా శక్తి నలము కొనుచుదేశ రక్ష జేయ బూనిధన్య జీవులవ్వండి. తిరునగరి గిరిజా గాయత్రి

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »