Blog Layout

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేయర్‌కు వినతి

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మేయర్‌ దండు నీతూ కిరణ్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో ఏఐటియుసి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై వితని పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలు అపరిష్క ృతంగా పెరిగిపోతున్నాయని వాటి పరిష్కారం కోసం ఎన్నిసార్లు ఆందోళన …

Read More »

జులై 18న ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. 2021-22 ఏడాదిగాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం జులై 18న ప్రవేశ పరీక్ష జరగనున్నట్లు కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం వెల్లడిరచారు. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

Read More »

236 లీటర్ల గ్లైఫోసేట్‌ పట్టివేత

డిచ్‌పల్లి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ముల్లంగి (వి) గ్రామం కోకట్ల శ్రీనివాస్‌ వద్ద నిషేధిత గ్లైఫోసేట్‌ ఉన్నట్టు సమాచారం అందుకుని తమ సిబ్బందితో దాడులు చేసినట్టు టాస్కు ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ ఎండి. షాకీర్‌ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా నిషేధిత గ్లైఫోసేట్‌ సీసాలు మొత్తం 236 లీటర్లను స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

Read More »

డాక్టర్‌ వేద ప్రకాష్‌ సేవలు అభినందనీయం

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ వేద ప్రకాష్‌ను వైస్‌ ఛాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా అభినందించారు. రక్తదానంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే విద్యార్థుల కోసం అనేక సైకాలజీ పుస్తకాలను సంపాదకీయం చేయడం జరిగిందని, అటువంటి పుస్తకాలను చదివి ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారని, రక్తదానంలో చేస్తున్న సేవలకు గాను ప్రశంసా …

Read More »

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ఖలీల్‌ వాడిలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం, అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్‌ వాక్సినేషన్‌ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, వ్యాక్సినేషన్‌ విధానాన్ని నిర్వహకులని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ మహమ్మారి నుండి బయట పడాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమ్మని, ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. స్వయంగా తాను …

Read More »

కాంగ్రెస్‌ నుండి టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిక

మోర్తాడ్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలం లోని ధర్మోర గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి జక్క లింగం తన 20 మంది అనుచరులతో మోర్తాడ్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల సమక్షంలో మంగళవారం టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారని మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా తెలిపారు. కార్యక్రమంలో మోర్తాడ్‌ మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివా లింగు …

Read More »

ఫీజుల నియంత్రణకు ప్రత్యేక జీవో తీసుకురావాలి

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి డిఇవోకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందఠరేగా బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్‌ మాట్లాడుతూ ఒక వైపు కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు ఆన్‌ లైన్‌ క్లాసుల …

Read More »

సాగు భూములపై ఫారెస్ట్‌ అధికారుల దౌర్జన్యం ఆపాలి

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరికొండ మండలం తుంపల్లి గ్రామ శివారులో గల దొంగ చెరువు శివారు భూమి గత 50 సంవత్సరాలుగా సాగుచేస్తున్న పేద రైతు కూలీలపై ఫారెస్ట్‌ అధికారుల దౌర్జన్యం సిగ్గుచేటని వెంటనే ఫారెస్ట్‌ అధికారుల దౌర్జన్యం ఆపాలని ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం నిజామాబాద్‌ డిఎఫ్‌ఓ కార్యాలయాన్ని ముట్టడిరచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2006లో అటవీ …

Read More »

అర్హులైన అందరు కుటుంబ నియంత్రణ చేయించుకోవాలి

ఆర్మూర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య శాఖ, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పురుషులకు కుటుంబ నియంత్రణపై అవగాహన పెంచాలని జిల్లా ఉప ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్‌ రమేష్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబనియంత్రణ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని …

Read More »

అర్గుల్‌లో సిసి కెమెరాలు ప్రారంభం

జక్రాన్‌పల్లి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో సిసి కెమెరాల ఆవశ్యకతను జక్రాన్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని అర్గుల్‌ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. 32 సిసి కెమెరాలు ప్రారంభించారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సిసి కెమెరాల ద్వారా నేరాలను అరికట్టవచ్చన్నారు. కెమెరాలు 24 గంటలు పనిచేస్తాయని, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »