Blog Layout

కంఠం లో కరోనా – అధికారులు అలర్ట్

నందిపేట్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నందిపేట మండలంలోని కంఠం గ్రామంలో 44 క‌రోనా కేసులు రావడంతో గత నాలుగైదు రోజులుగా జిల్లా అధికారులు కంఠం గ్రామాన్ని ప్రతి రోజు సందర్శిస్తు కరోన కట్టడి కొరకు మండల అధికారులకు దిశ నిర్దేశం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోన పాజిటివిటి తగ్గి మండలంలో కూడ వంద నుండి జీరో కు తగ్గిందని అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే …

Read More »

మోర్తాడ్ లో దొంగల అలజడి

మోర్తాడ్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో రోజురోజుకు దొంగల అలజడి పెరిగిపోతుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ వారం రోజులలో ఎస్‌సి వాడలో రెండుసార్లు దొంగలు రావడంతో వారిని పట్టుకోవడానికి యువకులు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ చాకచక్యంగా పారిపోయార‌ని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రామంలో ఆయా వీధుల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి గస్తీ తిరిగితే …

Read More »

నూతన సమీకృత కలెక్టరేట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నూతన సమీకృత కలెక్టరేట్ ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. బుధవారం బైపాస్ రహదారి సమీపములో నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో సివిల్ వర్క్స్ పూర్తి అయినందున కార్యాలయానికి ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్ త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మీటింగ్ హాల్, కలెక్టర్ ఛాంబర్, మినిస్టర్ ఛాంబర్, వివిధ శాఖలకు కేటాయించిన …

Read More »

టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ సైన్ బోర్డ్, బ్రోచర్ ను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్‌

నిజామాబాద్ జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ సైన్ బోర్డ్, బ్రోచర్ ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం కలెక్టరేట్లో ఐ-కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో, పట్టణాలల్లో నివసించే ప్రజలకి ఒక ఫోన్ కాల్ చేసి “ఉచిత టెలి మెడిసిన్” ద్వారా నేరుగా వైద్యసేవలు అందించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని …

Read More »

ఆక్సిజన్ జనరేట్ చేసుకోవడం వల్ల మరింత నమ్మకం

నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆక్సిజన్ మన దగ్గరే జనరేట్ చేసుకుంటే పేషెంట్లకు మరింత నమ్మకంగా ట్రీట్మెంట్ ఇవ్వవచ్చని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో సిఐఐ, టిసిఎస్‌, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ ఆసుప‌త్రికి 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను విరాళంగా కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో ఆక్సిజన్ …

Read More »

మోర్తాడ్ లో చేపల విక్రయం

మోర్తాడ్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం మృగశిర కార్తె ను పురస్కరించుకుని స్థానిక గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగ పుత్రులు మోర్తాడ్ లోని ముసలమ్మ చెరువు నుండి చేపలు పట్టుకొచ్చి గ్రామంలో విక్రయించారు. మృగశిర కార్తి రోజున చేపలు తినాలని గత సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్నది. గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉండేందుకు స్థానిక గంగపుత్రులు చేపలు పట్టుకు వచ్చి …

Read More »

ఆలయ అభివృద్ధి చేపడతాము…

నందిపేట్‌, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నందిపేట్ మండలం లోని సిహెచ్ కొండూరు గ్రామంలో గల లక్ష్మీనారాయణ స్వామి మందిరం అభివృద్ధికి చేపడతామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని చౌడ‌మ్మ కొండూరు గ్రామంలో గల లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో కలిసి దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి దైవమైన లక్ష్మీ నారాయణ స్వామి మందిర …

Read More »

అడ‌గ‌గానే ఆక్సీజ‌న్‌…

కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మంగ‌ళ‌వారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భిక్కనూరు మండలం లోని గుర్జకుంట గ్రామానికి చెందిన దాసరి బాలకృష్ణకు ఆక్సీజ‌న్ అంద‌జేశారు. బాలకృష్ణ కరోనా వ్యాధితో బాధపడుతూ దవాఖాన లో చేరగా చికిత్స తర్వాత, డాక్టర్ సలహా మేరకు, ఆక్సిజన్ అవసరమని ఆయన కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేశారు. షబ్బీర్ అలీ వెంటనే …

Read More »

మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే

కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి. టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంకు లో మంగ‌ళ‌వారం తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన హరిప్రసాద్ 23 వ సారి తన జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ హరి ప్రసాద్ సహాయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడమే …

Read More »

విదేశీ ఉద్యోగార్ధులకు, సెలవుపై వచ్చినవారికి ప్రాధాన్యతతో కోవిడ్ టీకాలు ఇవ్వాలి

హైద‌రాబాద్‌, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే వారికి, విదేశాల నుండి సెలవుపై వచ్చిన వారికి ప్రాధాన్యతతో కోవిడ్ టీకాలు ఇవ్వాలని భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు పొందిన తెలంగాణ రాష్ట్రంలోని రిక్రూటింగ్ ఏజెన్సీల సంఘం ‘ఓవర్సీస్ మ్యాన్‌పవర్ రిక్రూటర్స్ అసోసియేషన్’ (ఓమ్రా) అధ్యక్షులు డి ఎస్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంగళవారం లేఖ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »