Blog Layout

ప్రజావాణిలో 66 ఆర్జీలు

కామరెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలపై సమర్పించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణిలో (66) అర్జీలు …

Read More »

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 90 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ అంకిత్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ …

Read More »

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-3 పరీక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నిర్వహించిన గ్రూప్‌-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించి పలు సూచనలు చేశారు. కాగా, …

Read More »

బాన్సువాడలో సహస్ర అవధాని గరికపాటి ప్రవచనం

బాన్సువాడ, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణానికి ఈనెల 24న సహస్ర అవధాని గరికపాటి నరసింహారావు విచ్చేయుచున్నారని అయ్యప్ప ఆలయ నిత్య అన్నదాన ట్రస్ట్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి అలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని జూనియర్‌ కళాశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు గరికపాటి నరసింహారావు ప్రవచనాన్ని మండలంలోని ఆయా …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, నవంబరు 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 10.04 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 7.27 వరకుయోగం : సిద్ధం రాత్రి 9.34 వరకుకరణం : వణిజ ఉదయం 10.45 వరకుతదుపరి విష్ఠి రాత్రి 10.04 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 3.43 – 5.17దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.07 …

Read More »

ప్రశాంతంగా గ్రూప్‌-3 పరీక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్‌-3 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఆదివారం ఉదయం జరిగిన మొదటి సెషన్‌ పరీక్షకు జిల్లాలో మొత్తం 19,941 మంది అభ్యర్థులకు గాను, 10,037 మంది హాజరు కాగా, 9904 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. ఉదయం సెషన్‌ లో 50.33 …

Read More »

పకడ్బందీగా కొనసాగుతున్న సర్వే

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్ధిక స్థితిగతుల విశ్లేషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లాలో మొత్తం 469988 నివాస గృహాలకు గాను శనివారం సాయంత్రం నాటికి 295436 ఇళ్లలో వివరాల సేకరణ జరిగిందని, 62.86 శాతం సర్వే పూర్తయ్యిందని …

Read More »

మన కామారెడ్డి రైల్వే స్టేషన్‌ ఇలా ఉండబోతుంది…

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కామారెడ్డి రైల్వే స్టేషన్‌ను తిరిగి అభివృద్ధి చేస్తున్నారు ప్రాజెక్ట్ వ్యయం ~ ₹39.9 కోట్లు రాబోయే పునరాభివృద్ధి కామారెడ్డి స్టేషన్ యొక్క ప్రతిపాదిత డిజైన్‌లపై ఒక సంగ్రహావలోకనం See insights and ads పోస్ట్‌ని ప్రచారం చేయండి · Promote post Like Comment Send Share

Read More »

కామారెడ్డిలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం మహిళా పిల్లల, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం లో భాగంగా వికలాంగులకు ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వికలాంగులు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి చందర్‌ నాయక్‌, …

Read More »

గ్రూప్‌-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఈ నెల 17, 18వ తేదీలలో జరుగనున్న గ్రూప్‌-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. 17న ఉదయం 10.00 గంటల నుండి మధ్యాన్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »