Blog Layout

బస్సు అదుపుతప్పింది… పిల్లలు క్షేమం

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, చిట్యాల గ్రామానికి చెందిన విద్యార్థులను తీసుకు వెళ్లడానికి వెళ్లిన నందాస్‌ ప్రైవేటు స్కూల్‌ బస్‌ తిరుగు ప్రయాణంలో చిట్యాల శివారులో తాడ్వాయి రోడ్డు లో అదుపు తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. తమ పిల్లలకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బయటికి వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.

Read More »

చెరువులో చేప పిల్లలను వదిలిన మత్స్యకారులు

బాన్సువాడ, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని నాగారం గ్రామ శివారులోని గిద్దలచెరువులో రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో అందజేసిన చేప పిల్లలను పంచాయతీ కార్యదర్శి నవీన్‌ గౌడ్‌, మత్స్యకారులు చెరువులో చేపలను వదిలారు. కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కిష్టబోయి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆటో డ్రైవర్లకు జీవన భృతి కల్పించాలి..

బాన్సువాడ, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో పై జీవనాధారం సాగిస్తున్న వారి కుటుంబాలు అగమ్య గోచరంగా తయారయ్యాయని సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్‌ అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజలకు …

Read More »

దైనందిన జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగంగా మల్చుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని అన్నారు. నిజామాబాద్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్‌ …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మాణిక్‌ భండార్‌లో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించి, ఇప్పటివరకు ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, రైస్‌ మిల్లులకు ఎంత ధాన్యం తరలించారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లర్ల వద్ద ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. …

Read More »

నేటి పంచాంగం

శనివారం, నవంబరు 16, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి రాత్రి 1.09 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.17 వరకుయోగం : పరిఘము రాత్రి 2.27 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.09 వరకుతదుపరి కౌలువ రాత్రి 1.09 వరకు వర్జ్యం : ఉదయం 9.58 – 11.28దుర్ముహూర్తము : ఉదయం 6.09 …

Read More »

వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభం

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ సరస్వతి శిశుమందిర్‌ ప్రైమరీ స్కూల్‌ భగత్‌ సింగ్‌ నగర్‌లో స్వర్గీయ కొండ లక్ష్మయ్య జ్ఞాపకార్థము వారి శ్రీమతి కొండ అనసూయ, వారి కుమారుడు కొండ అశోక్‌ కుమార్‌ సుమారు 2 లక్షల విలువ గల వాటర్‌ ప్లాంట్‌ ను బహుకరించి ప్రారంభించారు. కార్యక్రమములో ముస్త్యాల రమేష్‌ పాఠశాల అధ్యక్షులు, ముప్పారపు ఆనంద్‌ జిల్లా కార్యదర్శి, రాజిరెడ్డి, చీల …

Read More »

కామారెడ్డిలో బీర్షాముండ జయంతి

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఆధ్వర్యంలో బీర్షాముండా 150వ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, స్థానిక సంస్థలు. డి సి డి ఓ రజిత, జిల్లా ప్రత్యేక అధికారి పద్మ, సిపిఓ రాజారామ్‌, డిస్టిక్‌ ఫిషరీస్‌ ఆఫీసర్‌ శ్రీపతి, …

Read More »

రెండు రోజులు కొనుగోళ్ళు బంద్‌

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 16,17 తేదీల్లో సి.సి. ఐ. పత్తి కొనుగోళ్లను సీసీఐ వారు బంద్‌ చేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్‌ అధికారిని పి. రమ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మద్నూర్‌లో సిసిఐ కొనుగోలు నందు16,17 తేదీలలో రెండు రోజుల పాటు సిసిఐ కొనుగోళ్లు బంద్‌ ఉంటాయని, ప్రతీ శనివారం మరియు ఆదివారం రెండు రోజులు సిసిఐ కొనుగోలు ఉండవని …

Read More »

దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూకు ఘన నివాళులు

నిజామాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేష్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »