Tag Archives: 2023 elections

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కొనసాగనున్న ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కలెక్టర్‌ శనివారం పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌తో కలిసి కౌంటింగ్‌ సెంటర్లను పరిశీలించారు. ఆయా సెగ్మెంట్లలో కౌంటింగ్‌ కోసం …

Read More »

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో భాగంగా కౌంటింగ్‌ సిబ్బంది రెండవ విడత యాద్రుచ్చికరణ (ర్యాండమైజెషన్‌) ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శనివారం కలెక్టరెట్‌లోని ఎన్‌.ఐ.సి హాల్‌లో కౌంటింగ్‌ పరిశీలకులు చిఫంగ్‌ ఆర్థుర్‌ వర్చుయో, జగదీశ్‌, అభయ్‌ నందకుమార్‌ కరగుట్కర్‌ సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను …

Read More »

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో డిసెంబర్‌ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్రాజ్‌ తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలవుతుంది. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. ఉదయం 10 గంటల సమయంలో తొలి ఫలితం రావొచ్చు. ఇందుకోసం 49 కేంద్రాలు అందుబాటులో ఉంచాం. ఇవాళ కౌంటింగ్‌పై అధికారులతో సమీక్షలు …

Read More »

కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంత వాతావరణం నడుమ సాఫీగా పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఓట్ల లెక్కింపు కేంద్రాలలోని స్ట్రాంగ్‌రూమ్‌ లకు చేర్చారు. ఆయా సెగ్మెంట్ల నుండి ఓట్ల లెక్కింపు కేంద్రాలైన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నీక్‌ కళాశాలలకు ఈవీఎంల తరలించగా, జాగ్రత్తగా వాటిని సరిచూసుకుని …

Read More »

యెండల లక్ష్మినారాయణపై దాడి

బాన్సువాడ, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని తాను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిలబడితే ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణ చూడలేని బిఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యర్థి పార్టీ నాయకులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అర్ధరాత్రి తన నివాసం పై జరిగిన దాడికి నిరసనగా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద …

Read More »

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. ఆర్మూర్‌ నియోజకవర్గానికి సంబంధించి పిప్రి రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ తో పాటు, బాల్కొండ సెగ్మెంట్‌ కు సంబంధించి …

Read More »

శతశాతం ఓటు వేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30న రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికలకు ఓటర్లు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఓటువేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని జిల ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరుగా నమోదయిన ప్రతిఒక్కరు నైతిక బాధ్యతగా శతశాతం ఓటువేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై, విస్తృతంగా అవగాహన …

Read More »

ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్‌ కలెక్టర్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ముందు రోజు నుంచి ఏర్పాట్లు జరగనున్నందున నవంబర్‌ 29న సెలవు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ నెల 29, 30న విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి. పాఠశాలలు, కాలేజీలు మళ్ళీ ఈ నెల …

Read More »

పోలింగ్‌ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు నిషేధం

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పురస్కరించుకుని ఎలక్షన్‌ కమిషన్‌ నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నవంబర్‌ 28 మంగళవారం సాయంత్రం 5:00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వచ్చిందని, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. …

Read More »

తప్పిదాలకు తావులేకుండా ఎన్నికల నిర్వహణ

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తుది ఏర్పాట్లలో ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలతో పాటు సీఎస్‌ఐ కాలేజీలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌, రిసీవింగ్‌ సెంటర్లను కలెక్టర్‌ మంగళవారం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »