బాన్సువాడ, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గ ప్రజల హక్కును స్వేచ్ఛను హరిస్తున్న పోచారం కుటుంబ సభ్యుల భారీ నుండి బాన్సువాడ ప్రజలను కాపాడానికే బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని యెండల లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. …
Read More »శ్రీ వాసవి పాఠశాల మాక్ పోలింగ్
మద్నూర్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి పాఠశాలలో గురువారం పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. పాఠశాల అధ్యక్ష కార్యదర్శుల కార్యవర్గాన్ని ఓటింగ్ ద్వారా విద్యార్థులు ఎన్నుకున్నారు. పాఠశాల అధ్యక్షుడిగా వెంకటాద్రి, కార్యదర్శి శృతికలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పాఠశాల నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వినోద్, శశికాంత్ , ఉమాకాంత్, ఉపాధ్యాయ బృందం, …
Read More »గురువారం 33 నామినేషన్లు దాఖలు
నిజామాబాద్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గురువారం రోజున 33 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి ఎస్.కె.మాజిద్ (మజ్లీస్ బచావో తెహ్రీక్), ఆశన్నగారి జీవన్ రెడ్డి (బీ.ఆర్.ఎస్), తాళ్లపల్లి శేఖరయ్య (విద్యార్థుల రాజకీయ పార్టీ), గండికోట …
Read More »జిల్లాలో నేడు 25 నామినేషన్లు దాఖలు
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బుధవారం రోజున 25 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా నారాయణపేట రాజేష్, బీజేపీ అభ్యర్థిగా పైడి రాకేష్ నామినేషన్లను సమర్పించారు. బోధన్ సెగ్మెంట్ నుండి వి.మోహన్ రెడ్డి(బీజేపీ), పి.గోపి కిషన్(శివసేన), ఎండి.యూసుఫ్ …
Read More »నేడు 36 నామినేషన్లు దాఖలయ్యాయి…
కామారెడ్డి, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం 36 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో ఇద్దరు అభ్యర్థులు రెండు సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా, మరో 12 మంది అభ్యర్థులు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎలారెడ్డి నియోజకవర్గం నుండి ఆరుగురు ఒక్కో నామినేషన్ …
Read More »ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్‌తో కలిసి కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన …
Read More »లాభాన్ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చుతాం
గాంధారి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని లాబానా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చి వారి కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రంలో గల లాబానా నాయకులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో తమను రిజర్వేషన్ ఎస్టీ …
Read More »పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమవుతూ అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈఓ సమీక్ష జరిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 10 వ తేదీ నాటితో …
Read More »శిక్షణా తరగతులకు హాజరుకాని వారికి షోకాజు నోటీసులు
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విధులు కేటాయించిన సిబ్బంది తప్పక అట్టి విధులు నిర్వహించాలని, అందులో ఎలాంటి మినహాయింపు లేదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరెట్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి నోడల్ అధికారులతో సమావేశామయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అక్టోబర్ 28, 30 తేదీలలో మొదటి విడతగా ప్రిసైడిరగ్ అధికారులు, …
Read More »పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి
నిజామాబాద్, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉండే పోలింగ్ విధులను ప్రిసైడిరగ్ అధికారులు (పీ.ఓలు), సహాయ ప్రిసైడిరగ్ అధికారులు (ఏ.పీ.ఓ.లు) సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. పోలింగ్ రోజున కలెక్టర్ తో పోలిస్తే పీ.ఓ లు నిర్వర్తించాల్సిన బాధ్యత ఎంతో ఎక్కువ అయినందున క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై పూర్తి అవగాహనను …
Read More »