కామారెడ్డి, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ల స్వీకరణ రెండవ రోజైన శనివారం 7 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో ఆరు నామినేషన్లు, జుక్కల్ నియోజక వర్గంలో ఒక నామినేషన్ దాఖలు కాగా ఎల్లారెడ్డి నియోజక వర్గం నుండి ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేవని ఆయన తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో స్వంత్ర అభ్యర్థులుగా …
Read More »స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
దోమకొండ, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుందని స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా శనివారం దోమకొండలో బీడీ కార్మికులకు ఓటు వినియోగంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు అనేది మనకు కల్పించిన హక్కని, ఎటువంటి ప్రలోభాలకు లొంగక స్వేచ్ఛగా తమ ఓటు …
Read More »స్పీకర్‌ను ఓడిస్తా.. యెండల లక్ష్మినారాయణ
బాన్సువాడ, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ బాజాపా అభ్యర్థిగా ఎన్నికలలో యెండల లక్ష్మీనారాయణకు టికెట్ కేటాయించడంతో తొలిసారి బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా భాజపా శ్రేణులు మోస్ర మండల కేంద్రం వద్ద నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామాలయంలో లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి మోస్రా, చందూర్, వర్ని, కోటగిరి, పోతంగల్ మండలం మీదుగా బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల మీదుగా …
Read More »శాసనసభ బరిలో నలుగురు గల్ఫ్ సంఘాల నేతలు
నిజామాబాద్, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సారనాథ్‌లోని అశోకుని స్థూపంలోని నాలుగు సింహాల స్ఫూర్తిగా… నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఆజాద్ హింద్ ఫౌజ్) ధైర్య సాహసాలతో రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నలుగురు గల్ఫ్ సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారు. అశోకుని సారనాథ్ స్థూపంలో నాలుగు సింహాలు వీపు వీపు కలుపుకుని వృత్తాకారంలో నిలుచుండి ముందుకు చూస్తూ ఉంటాయి. వెనుకవైపు …
Read More »అభ్యర్థుల ఖర్చులపై పర్యవేక్షణ ఉండాలి
కామారెడ్డి, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు పర శివమూర్తి శనివారం ఎలారెడ్డి నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించి అధికారులకు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలకు వ్యయ పర్యవేక్షణపై తగు సూచనలు ఇచ్చారు. ముందుగా ఎల్లారెడ్డి రిటర్నింగ్ కార్యాలయాన్ని సందర్శించి సహాయ వ్యయ పరిశీలకులకు, ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి అకౌంటింగ్ బృందానికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం తాడ్వాయి, లింగంపేటలో ఫ్లైయింగ్ స్క్వాడ్ …
Read More »ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఈవీఎం గోడౌన్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. బ్యాలెట్ యూనిట్‌లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లు, భద్రపరచి ఉన్న ఇతర ఎన్నికల సామాగ్రి వివరాలతో కూడిన రికార్డులను తనిఖీ చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని …
Read More »నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, సీ.పీ
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం వెలువడిన నేపధ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నగరపాలక సంస్థ నూతన భవనంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని, నగర పాలక సంస్థ పాత భవనంలో నిజామాబాద్ …
Read More »సి విజల్ పనితీరు భేష్…
కామారెడ్డి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలలో అభ్యర్థులు చేసే ఖర్చును అకౌటింగ్ టీమ్ పక్కాగా నిర్వహించాలని వ్యయ పరిశీలకులు పరా శివమూర్తి సూచించారు. జిల్లాకు వ్యయ పరిశీలకులుగా వచ్చిన పరా శివమూర్తి శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నోడల్ అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులు, ఎఫ్‌ఎస్‌టి, బిఎస్‌టి, ఎస్‌ఎస్‌టి తదితర బృందాలు, ఎన్నికల విభాగం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి …
Read More »నామినేషన్ల పర్వం… 4 నామినేషన్లు దాఖలు
కామారెడ్డి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ల పర్వం మొదలైన శుక్రవారం కామారెడ్డి నియోజక వర్గంలో 4 నామినేషన్లు దాఖలు కాగా, జుక్కల్, యెల్లారెడ్డి నియోజక వర్గాల నుండి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా వెంకన్న గుగులోతు, ఆరోళ్ల నరేష్, చిట్టిబొయిన సులోచన రాణి నామినేషన్లు దాఖలు …
Read More »సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :సి -విజిల్ యాప్ ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చని వారి పేర్లు, ఫోన్ నెంబర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు తమ చుట్టుప్రక్కల జరుగుచున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబందించిన ఫోటోలు లేదా …
Read More »