నిజామాబాద్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు అదనపు కలెక్టర్ …
Read More »మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి
నిజామాబాద్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజానికి పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నేతృత్వంలో బుధవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి, …
Read More »గాంధారి మండలంలో గ్రామ సభలో పాల్గొన్న అదనపు కలెక్టర్
గాంధారి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత కలిగిన పేద కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ తెలిపారు. శుక్రవారం గాంధారి మండలం ఖర్కవాడి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గ్రామ సభ ఆమోదం మేరకు అర్హత …
Read More »ఇళ్ళ సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును ఆయన పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు, భూముల వివరాలు పరిశీలించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, …
Read More »పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు
నిజామాబాద్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకుని అదనపు కలెక్టర్ అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆయన ఛాంబర్‌లో సోమవారం జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. …
Read More »ధాన్యం విక్రయాలు వేగవంతం చేయాలి
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సహకార సంఘాల అధికారులను కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని జెసి చాంబర్లో సహకార సంఘాల అధికారులతో దాన్యం నిలువలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న దాన్యం …
Read More »పిల్లలతో పనిచేయిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం స్థానిక నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళ శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ ముస్కాన్‌పైన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి హాజరై మాట్లాడారు. తప్పిపోయిన పిల్లలని గుర్తించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు పిల్లలతో …
Read More »బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ) పి.యాదిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్‌కు చేరుకుని ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్‌కు స్వాగతంపలికి, పరిచయం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా కొనసాగిన …
Read More »సీబీఆర్టీ (ఏఈఈ) రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ శాఖల్లో సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏ.ఈ.ఈ) పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఈ నెల 8, 9 వ తేదీలలో జరుగనున్న రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు సంబంధిత …
Read More »అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణను మెరుగుపర్చాలి
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారంలో భాగంగా ప్రధాన రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించే విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. మాక్లూర్ మండలం మామిడిపల్లి నుండి ఆర్మూర్, అర్గుల్ మీదుగా డిచ్ పల్లి వరకు కలెక్టర్ శుక్రవారం క్షేత్ర స్థాయిలో …
Read More »