ఆలూరు, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలూర్, దేగాం గ్రామాలలో సంఘం చైర్మన్ కళ్లెం భోజరెడ్డి, తహసిల్దార్ దత్తాద్రి, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2060 …
Read More »మహిళలకు చక్కటి పొదుపు అవకాశం…
ఆర్మూర్, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్, సబ్ పోస్టాఫీస్, గ్రామాలలోని బ్రాంచ్ పోస్టాఫీసులలో ఎక్కడైనా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టీఫికెట్ – 2023 గురించి సంప్రదించి ఈ ఖాతాను ప్రారంభించవచ్చని శనివారం నిజామాబాద్, ఆర్మూర్ పోస్టల్ అదనపు ఎస్పీ యాపరు సురేఖ ఒక ప్రకటనలో కోరారు. భారత ప్రభుత్వం తపాలా శాఖ మహిళలకు మరియు ఆడపిల్లలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర …
Read More »సాఫ్ట్‌బాల్‌లో విద్యార్థుల ప్రతిభ
ఆర్మూర్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 2వ తేదీన సుద్ధపల్లిలో జిల్లాస్థాయి అండర్-10 విభాగంలో సాఫ్ట్‌బాల్ పోటీలలో మామిడిపల్లి సెయింట్ పాల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు కెప్టెన్‌గా పి. అక్షిత్, శ్రీనిధు జట్టులో చక్కటి ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిపారు. జట్టులో పీ. అక్షిత్ అనే విద్యార్థికి టోర్నమెంట్లో బెస్ట్ పిక్చర్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. పాఠశాల ప్రిన్సిపాల్ కేథరిన్ పాల్ అభినందించారు. …
Read More »ఆర్మూర్‌లో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్దం
ఆర్మూర్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం అర్ధరాత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ని రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా, అక్రమంగా, అన్యాయంగా పోలీసులను ఉసిగొలిపి ఎందుకు అరెస్టు చేశారో తెలపకుండానే పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని కెనాల్ బ్రిడ్జి పైన కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాష్ట్ర …
Read More »ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణ పక్షం
ఆర్మూర్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు నిర్వహించవలసిన బాధ్యతలను వివరించారు. హోప్ హాస్పిటల్ డాక్టర్ అనుకోకుండా రోడ్డుపై వెళ్లే వ్యక్తికి హార్ట్ ఎటాక్ ఏ విధంగా సేవ్ చేయాలో వివరించారు. హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తి సడన్‌గా పడిపోతే సిపిఆర్ ద్వారా మనిషిని బ్రతికించవచ్చని …
Read More »సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రారంభమైన వార్షిక ఉత్సవం
ఆర్మూర్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ పరిధిలోని కోటార్మూరులో గల విశాఖ కాలనీలోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో శనివారం అష్టమ వార్షికోత్సవ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ బ్రహ్మశ్రీ బల్యపల్లి సుబ్బరావు గురుస్వామి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఉదయము శాంతి మంత్ర పరసము, గౌరి గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము నవగ్రహ, మాత్మక యోగిని వాస్తు క్షేత్రపాలకు, సర్వతోభద్ర మండలాధి ఆరాధన, హవనములు స్వామి వారికి …
Read More »ఆలూర్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
ఆలూరు, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండల కేంద్రంలోని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చైత్ర శుద్ధ నవమి రోజున ఆలూర్ గ్రామంలో శ్రీరాముని యొక్క జననం నిర్వహిస్తారు. పురోహితులు మాట్లాడుతూ ప్రతి ఆలయంలో శ్రీరామ చంద్రుని కళ్యాణం జరిపితే ఆలూర్ రామాలయంలో శ్రీరాముని జననం జరుపుతారన్నారు. ఈ ఆలయానికి విశిష్టతగా పూర్వం నుండి శ్రీరామనవమి రోజున రాముడి యొక్క జననం నిర్వహించడం ప్రత్యేకత. …
Read More »ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి
ఆర్మూర్, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆర్మూర్, పెర్కిట్, కొటార్మూర్, పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా వీరి ఇంటి ముందరే ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రియా, గంగా మోహన్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని మార్చి 31 చివరితేదీ కాబట్టి దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని …
Read More »ఐసీడిఎస్ ఆధ్వర్యంలో పోషకాహారంపై అవగాహన
ఆర్మూర్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్‌లోని సంతోష్ నగర్ గల్లీలో అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ ఆర్మూర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పిల్లలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించారు. ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రతిరోజు తృణ ధాన్యాలు తీసుకోవాలని అవి రాగులు, సజ్జలు, కొర్రలు బెల్లం నువ్వులు ఆహారంలో భాగంగా తీసుకోవాలని పిల్లలకు ఎత్తుకు తగిన బరువు ఉండేలాగా చూసుకోవాలని ఆరోగ్యం పై ఎక్కువ …
Read More »కొండగట్టుకు పాదయాత్ర…
ఆర్మూర్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం వాగ్గడ్డ హనుమాన్ మందిరం నుండి హనుమాన్ స్వాములు పాదయాత్రగా గురువారం బయలుదేరారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామం నందు వెలసిన శ్రీ మహాపుణ్యక్షేత్రం కొండగట్టు వరకు పాదయాత్రగా బయలుదేరి స్వామి అంజన్నకు మొక్కులు తీర్చుకుంటారు. ఇలా ప్రతి ఏటా అంజన్న హనుమాన్ స్వాములు పాదయాత్రకు బయలుదేరుతారు. భక్తులు మాట్లాడుతూ ప్రతి ఊరు ఊరు …
Read More »