ఆర్మూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయల ఎల్‌ఓసీని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామానికి చెందిన ఎస్ రమేష్ రెడ్డి గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వైద్య చికిత్స కోసం …
Read More »మంత్రులతో భేటీ అయిన ఎమ్మెల్యే
ఆర్మూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి బుధవారం పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులతో …
Read More »పోస్టల్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…
ఆర్మూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ సబ్ డివిజన్ పోస్టల్ అధికారిణి వై.సురేఖ బుధవారం తెలిపారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన తపాలా శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా తమ సేవలను విస్తరిస్తోందని, బట్వాడి నుండి మొదలుకొని డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోందని, ప్రజల ప్రయోజనాల కోసం …
Read More »శివనామస్మరణతో మారుమోగిన ‘‘సిద్ధుల గుట్ట’’
ఆర్మూర్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్తీక మాసం చివరి రోజైన మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట శివనామస్మరణతో మారుమోగింది. వేలాది మంది భక్తులు సిద్ధులగుట్టపైకి చేరుకొని మహాదేవుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల కోలాహలం మధ్య గిరిప్రదక్షిణ (సప్తాహారతి) వైభవోపేతంగా జరిగింది. సిద్ధులగుట్ట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయించారు. జీవన్ రెడ్డి …
Read More »కోమన్‌పల్లిలో స్వచ్చత రన్
ఆర్మూర్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచం మరుగుదొడ్ల దినోత్సవం 19 నవంబర్ సందర్బంగా కోమన్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో స్వచ్చతా రన్ నిర్వహించారు. కార్యక్రమంలో పారిశుద్ధ్యం, భూగర్భజలాలు, స్వచ్ఛతను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థులు, పలువురు నాయకులు, స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరేడి రాజేశ్వర్, సెక్రెటరీ ప్రసాద్, కారోబార్ నవీన్, ప్రాథమిక, హై స్కూల్ బోధనా సిబ్బంది, …
Read More »తహసిల్దార్ కార్యాలయంలో ‘ధరణి’ ప్రారంభం
ఆర్మూర్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలో తహశీల్దార్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కం జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మార్వో దత్తాద్రి మాట్లాడుతూ నేటి నుండి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చెయ్యటం జరుగుతుందని, దీనికి తమ దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్లో స్లాట్ బుక్ చేయించుకొని వచ్చినట్లయితే తాము వెంటనే రిజిస్ట్రేషన్ …
Read More »ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దగ్దం
ఆర్మూర్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని, అదేవిధంగా టిఆర్‌ఎస్ గుండాలచే హైదరాబాదులో ఉన్న అరవింద్ ధర్మపురి ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో చేసి ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఆర్మూర్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పియుసి చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం సుర్బీర్యాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఎస్.సాయమ్మకు రూ. 16 వేలు, ఎం. రమేష్‌కు రూ. 15 వేలు, కె.రంజిత్‌కు రూ. 14 వేలు, వి. రాజు బాయికి రూ. 6 వేల 500 గ్రామ సర్పంచ్ సట్లపల్లి …
Read More »యూనియన్ స్వర్ణోత్సవాలకు తరలిరావాలి
ఆర్మూర్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో చేపూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. సభకు యూనియన్ ఆర్గనైజర్ నజీర్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న హజరై మాట్లాడారు. మన యూనియన్ ఆవిర్భవించి డిసెంబర్ 10నాటికి 50 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో స్వర్ణోత్సవ సభ నిర్వహించాలని యూనియన్ …
Read More »ప్రాథమిక పాఠశాలలో దాతల దినోత్సవం
ఆర్మూర్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో డోనర్స్ డే నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సంతోష్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బుధవారం గత సంవత్సర దాతలను ఘనంగా సన్మానించడం జరిగిందని, దాతల విరాళాలు అన్ని కలిపి సుమారు 90 వేల రూపాయలు కాగ సంతోష్ రెడ్డి తన సొంత రూపాయలు 70 వేల రూపాయలు ప్రాథమిక పాఠశాలకు అందజేశారు. …
Read More »