ఆర్మూర్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ప్రజాకవి, ప్రజాపోరుకు మరోపేరు శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్నకి పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గోరటి వెంకన్న కలం సృష్టించిన ‘వల్లంకి తాళం’ పుస్తకానికి అవార్డు రావడం మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా ఉందన్నారు. సామాన్యుల జీవితాన్నే సాహిత్యంగా మలచి, …
Read More »బిజెపి నాయకుల అరెస్టు
ఆర్మూర్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన నిరుద్యోగ దీక్ష విజయవంతం చేయడానికై వెళ్ళే పార్టీ కార్యకర్తలను అర్ధరాత్రివేళ అరెస్టు చేసి పోలీసు కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, …
Read More »తపస్వి తేజో నిలయంలో వాజ్‌పేయి జయంతి…
ఆర్మూర్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 97 వ జయంతిని పురస్కరించుకుని, సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధి మామిడిపల్లిలోని తపస్వితేజో నిలయంలో చిన్నారులతో కార్యక్రమం నిర్వహించారు. వాజపేయి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది లోక భూపతి రెడ్డి చిన్నారులకు …
Read More »జనవరిలో రాజకీయ శిక్షణా తరగతులు
ఆర్మూర్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 8,9 తేదీలలో ఆర్మూర్‌లో జరిగే పివైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు, కౌన్సిల్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు ఎం.సుమన్ తెలిపారు. శిక్షణా తరగతులు ఆర్మూర్ విజయలక్ష్మి గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ ఎన్.ఆర్. భవన్‌లో పివైఎల్ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల …
Read More »జర్నలిస్టు కుటుంబాలకు చెక్కుల పంపిణీ
ఆర్మూర్, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా బారినపడి మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు బుధవారం రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున చెక్కులను బాధిత కుటుంబాలకు చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కుమార్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో దాదాపు వంద మందికి పైగా జర్నలిస్టు కుటుంబాలకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి చెక్కులను …
Read More »జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
ఆర్మూర్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 27 నుండి 29 వరకు జగిత్యాల జిల్లాలో జరిగిన సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ రాష్ట్ర పోటీలలో జిల్లా బాలబాలికల జట్టు ప్రథమ స్థానం సాధించి ప్రాబబుల్స్ జట్టుకు జిల్లా క్రీడాకారులు ఎంపికై ఆర్మూర్‌లో, సుద్ధపల్లిలో జరిగిన శిక్షణ శిబిరంలో పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి తుది జట్టుకు ఎంపికై ఈనెల 15 నుండి 18 వరకు …
Read More »పెర్కిట్ పూసల సంఘం కార్యవర్గం ఎన్నిక
ఆర్మూర్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్‌లో పూసల సంఘం నూతన కార్యవర్గం నియామకమైంది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సుంకరి రంగన్న, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేని అంజయ్య ఆధ్వర్యంలో మంగళవారం పెర్కిట్ పూసల సంఘ అధ్యక్షులుగా మద్దినేని నరేష్, ఉపాధ్యక్షులుగా చేని శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పన్నీరు రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా పొదిల సతీష్, కోశాధికారిగా కావేటి నవీన్, కార్యదర్శిగా మద్దినేని …
Read More »ఆర్మూర్‌లో నృత్య మహోత్సవం
ఆర్మూర్, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం మామిడిపల్లి శ్రీ సాయి గార్డెన్‌లో తపస్వి సంస్థ మరియు భారతి నృత్య నికేతన్ ఆర్మూర్ వారు సంయుక్తంగా దక్షిణ తెలంగాణ ప్రాంత నాట్య కళాకారులను ప్రోత్సహిస్తూ మరియు తపస్వి సహాయార్థం నృత్య మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అరక్షిత పిల్లల సహాయార్థం కొరకు నిర్వహించినట్టు తపస్వి సంస్థ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నాట్య గురువులు …
Read More »సిసిరోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
బాల్కొండ, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలో 67 లక్షల విలువ గల రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన భూమిపూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహకారంపై బాల్కొండ మండల కేంద్రంలో సిసి రోడ్లు బిటి రోడ్లు వేసుకోవడం మోరీలు నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. గత నలభై యాభై సంవత్సరాలుగా మండల కేంద్రంలో …
Read More »రూ. 33 కోట్లతో అభివృద్ది పనులు
భీమ్‌గల్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం 33 కోట్లతో భీమ్‌గల్ మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాలలో ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, 70 సంవత్సరాలలో 33 కోట్లు నిధులతో అభివృద్ధి పనులకు గతంలో ఎన్నడూ శంకుస్థాపన జరగలేదన్నారు. …
Read More »