బాన్సువాడ, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం ఉగాది పండుగను పురస్కరించుకొని యువర్స్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ సందర్భంగా యువర్స్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సచిన్ మాట్లాడుతూ ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఉగాది పండుగ రోజున గత ఆరు సంవత్సరాలుగా ఉగాది పచ్చడిని ప్రజలకు వితరణ చేయడం …
Read More »నాణ్యమైన విద్యుత్ అందించడమే మా లక్ష్యం..
బాన్సువాడ, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు విద్యుత్ అంతరాయం కలగాకుండా ఉండేందుకు రాష్ట్ర సిఎండి ఆదేశాల మేరకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందని బాన్సువాడ డివిజనల్ అధికారి గంగాధర్ అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని సాయి కృప నగర్, బస్టాండ్ తదితర ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ …
Read More »నవవధువు ఆత్మహత్య
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలోని వల్లేపు లక్ష్మి ,వెంకటేష్ లకు గత నెల 23న వివాహం జరగగా, పెళ్లి ఇష్టం లేకపోవడంతో మంగళవారం నవవధువు వల్లెపు లక్ష్మి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తల్లి …
Read More »బకాయిలు చెల్లించాలి…
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీలో విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే విశ్రాంత ఉద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో బకాయిలను విడుదల చేయాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల డివిజన్ కన్వీనర్ శంకర్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతో విశ్రాంత …
Read More »బాన్సువాడ మున్సిపాలిటీ తైబజార్ బహిరంగ వేలం
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని మేకలు గొర్రెలు, వారాంతపు సంత, రోజువారి సంతను మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో తై బజార్ వేలం నిర్వహించగా రూ.67.77 లక్షలకు గుత్తేదారులు వేలంపాట ద్వారా దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేకల గొర్రెల సంత రూ.46.26 లక్షలకు, రోజువారిసంత రూ.9.02 లక్షలకు, వారాంతపు సంత రూ. 12.31 లక్షలకు …
Read More »న్యాయవాదిని హత్య చేసిన దుండగులను శిక్షించాలి..
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్న హైదరాబాదులో ఇజ్రాయిల్ అనే న్యాయవాదిని యాదగిరి అనే దుండగుడు హత్య చేయడం కిరాతకమైన చర్య అని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి అన్నారు. మంగళవారం బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయవాదులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి …
Read More »గుండెపోటుతో సొసైటీ వైస్ చైర్మన్ మృతి
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ అంబర్ సింగ్ మంగళవారం తన స్వగ్రామమైన రాంపూర్ తండాలో వడ్లు ఆరబెడుతుండగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిసింది. అందరితో కలివిడిగా ఉండే అంబర్ సింగ్ హఠాత్తుగా మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read More »బాన్సువాడ గడ్డ బిఆర్‌ఎస్ అడ్డా… ఎమ్మెల్సీ కవిత
బాన్సువాడ, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రం ఏర్పడినటువంటి బిఆర్‌ఎస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో పదేళ్లు సుపరిపాలన అందించడం జరిగిందని, బాన్సువాడ గడ్డ బిఆర్‌ఎస్ పార్టీకి అడ్డా అని పార్టీలోకి నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ కార్యకర్తలే పార్టీకి బలం బలగమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని జమా మసీదులో టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ …
Read More »బాన్సువాడకు ఎమ్మెల్సీ కవిత
బాన్సువాడ, మార్చ్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని బాన్సువాడ పట్టణంలోని జమా మసీదు ఆవరణలో సోమవారం బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లోని ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
Read More »బాల్య వివాహలను అరికట్టేందుకు కృషి చేయాలి..
బాన్సువాడ, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామపంచాయతీలో సోమవారం ఎన్జీవో సాధన ఆర్గనైజేషన్ గీత గ్రామంలో జరిగిన వివాహాల రికార్డు వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలను ప్రోత్సహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, బాలికలపై అగత్యాలకు పాల్పడుతూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. కార్యక్రమంలో పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ షాబుద్దీన్, సిబ్బంది చాంద్ తదితరులు పాల్గొన్నారు.
Read More »