Tag Archives: banswada

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డులు అందజేస్తాం..

బాన్సువాడ, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపల్‌ పరిధిలోని ఒకటో వార్డులో మంగళవారం ప్రజాపాలన వార్డు సభలో సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో ప్రజల నుండి రేషన్‌ కార్డు లేని వారి దరఖాస్తులను స్వీకరించాలని, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పై ప్రజల సలహాలు సూచనలు స్వీకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒకరికి ప్రభుత్వ …

Read More »

కేపీఎల్‌ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన కొత్తబాద్‌ క్రికెట్‌ జట్టు

బాన్సువాడ, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి బాన్సువాడకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషణ్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు అన్నారు. ఆదివారం బాన్సువాడ మండలంలోని కొత్తబాద్‌ గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ సహకారంతో నిర్వహించిన కేపీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌లో కొత్తబాధ్‌, బాన్సువాడ …

Read More »

ఒలంపియాడ్‌ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

బాన్సువాడ, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండల కేంద్రంలోని ద్రోణ ప్రైవేటు పాఠశాలలో ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఒలంపియాడ్‌ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సాయి ప్రసన్న 284 ర్యాంకు, వివంత్‌ రాజ్‌ 479 ర్యాంకులు సాధించారు. పాఠశాలకు సంబంధించిన ఎనిమిది మంది విద్యార్థులు ఇంటర్నేషనల్‌ స్థాయిలో వెయ్యిలోపు ర్యాంకులు సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు.

Read More »

ప్రమాదరహిత ప్రయాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలి..

బాన్సువాడ, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లపై ప్రయాణించే వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించి ప్రమాద రహిత ప్రయాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం బాన్సువాడ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రత నియమాలపై ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ …

Read More »

పద్మశాలి సంఘ క్యాలెండర్‌ ఆవిష్కరణ

బాన్సువాడ, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ మందిరంలో గురువారం పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ పద్మశాలి సంఘ నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రాజయ్య, రాష్ట్ర సంఘ కార్యదర్శి గొంట్యాల బాలకృష్ణ, శ్రీనివాస్‌, నరహరి, కాశీనాథ్‌, వెంకటేష్‌, అనిల్‌, మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి, లత, రేఖ, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర సీఈఓను కలిసిన డిసిసిబి డైరెక్టర్‌

బాన్సువాడ, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూరు మండలంలోని దామరంచ సొసైటీ చైర్మన్‌, డిసిసిబి డైరెక్టర్‌ కమలాకర్‌ రెడ్డి గురువారం హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్‌ సీఈఓ ను దేవేందర్‌ శ్యామ్‌ ను సిమ్లాలోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్‌ కమలాకర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో కోపరేటివ్‌ బ్యాంకుల పనితీరు విధి విధానాలను తెలుసుకోవడానికి …

Read More »

బడాపహాడ్‌ ఉర్సు ఉత్సవాలకు ఎమ్మెల్సీ కవిత

బాన్సువాడ, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని బడా పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవానికి ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హన్మాజిపేట్‌, కోనాపూర్‌ గ్రామాల మీదుగా బాన్సువాడ పట్టణ శివారులోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నట్లు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ జుబేర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల స్తూపం నుండి ర్యాలీగా …

Read More »

పశువులకు ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం

బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలంలోని చింతల్‌ పేట్‌ గ్రామంలో పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాన్ని శుక్రవారం మాజీ జెడ్పిటిసి హరిదాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో గర్వకోశ వ్యాధి ఉన్న పశువులకు ఉచితంగా నట్టల నివారణ మందులు అందజేశారు. శిబిరంలో మేలైన జాతి దూడల ప్రదర్శన నిర్వహించడంతోపాటు పాలు ఎక్కువ ఇస్తున్న గేదెలకు …

Read More »

ఎమ్మెల్యే ఇంటిముందు బైఠాయించిన ఆశా వర్కర్లు

బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంటి ముందు ఆశా వర్కర్లు బైఠాయించి ధర్నా చేపట్టి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకునికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి …

Read More »

వెంకటేశ్వర ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచారం, కాసుల

బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం, తిమ్మాపూర్‌ వెంకటేశ్వర ఆలయాలను రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ వెంకటేశ్వరుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, నాయకులు అంజిరెడ్డి, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »