ఎడపల్లి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రకరకాల పూలతో బతుకమ్మలను తయారుచేసి నూతన వస్త్రాలు ధరించిన విద్యార్థినిలు బతుకమ్మ ఆటలు ఆడారు. అలాగే జాన్కంపేట్ గ్రామంలోని ఇమేజ్ పాఠశాల, ఎడపల్లిలోని మాధవి, వాగ్దేవి పాఠశాలల్లో విద్యార్థుల …
Read More »తెలంగాణ సంస్కృతీ ప్రతిబింబం బతుకమ్మ
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతిబింబంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో శనివారం మెప్మా, మున్సిపల్ సిబ్బంది, పిఆర్‌టియు ఉపాధ్యాయునీల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఆడబిడ్డగా కీర్తించే గౌరమ్మకు అరుదైన గౌరవం బతకమ్మ పండగ తీసుకువచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బతకమ్మ …
Read More »గొల్లపల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ
రామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగ అందించే బతుకమ్మ చీరలను రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరథ రెడ్డి పంపిణి చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి బడుగు బలహీన వర్గాలు సైతం పండుగ రోజు సంతోషంగా నూతన దుస్తులు వేసుకొని ఆనందంగా పండుగ జరుపుకునేలా కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం ఆడపడుచులందరికి …
Read More »కలెక్టర్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ సంబరాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గురువారం మెప్మా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. వివిధ రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆవరణలో పెట్టి పాటలు పాడుతూ ఆటాడారు. అందంగా తయారుచేసిన బతుకమ్మలకు బహుమతులను ప్రధానం చేశారు. బతుకమ్మ సంబరాల్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్‌డిఓ సాయన్న, ఏపీ డి మురళి కృష్ణ, మెప్మా …
Read More »26 నుంచి బతుకమ్మ వేడుకలు
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26 నుంచి బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి అధికారులతో బతుకమ్మ ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాస్థాయి, మునిసిపల్, మండల స్థాయిలో బతుకమ్మలు ఆడే ప్రదేశాల్లో విద్యుత్తు లైట్లు అమర్చాలని సూచించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువుల వద్ద …
Read More »కోటి బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధం
హైదరాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రాంతంలో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ చిత్ర పటంలో మన తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళా సోదరీమణుల సంతృప్తి కోసం ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ప్రతి ఏడాది కోట్ల వ్యయం ఉన్నప్పటికీ ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నారు. రంగు రంగుల వన్నెల్లో, కలర్‌ఫుల్ రంగులతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో …
Read More »పడగల్‌లో ఘనంగా బతుకమ్మ సాంస్కృతిక ఉత్సవాలు
వేల్పూర్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో తెలంగాణ సాంస్క ృతిక పండుగ అయిన బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు, పిల్లలు రోజుకో తీరుగా బతుకమ్మ ఆడుతూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం 40 మంది మహిళలలు బతుకమ్మను పేర్చి చక్కని కోలాటం ఆటపాటలతో అందరినీ అలరించారు. …
Read More »సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగా పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే …
Read More »పూసల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
ఆర్మూర్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ అన్నపూర్ణ కాలనీలో సోమవారం పూసల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సంఘ భవనం వద్ద మహిళలు ఆటపాటలతో బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మకు పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని సంఘ అధ్యక్షుడు మద్దినేని నరేష్ తెలిపారు. కార్యక్రమంలో మహిళలు నాగమణి, పొదిల లత, …
Read More »జిల్లా ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అందరూ సుఖ:సంతోషాలతో బతకాలని బతుకునిచ్చే బతుకమ్మ పండుగ ప్రారంభరోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల మహిళలకు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి, గౌరమ్మను తీర్చి కోరిన …
Read More »