నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం బడా భీంగల్, చెంగల్, బాబాపూర్, పల్లికొండ తదితర గ్రామాలలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. …
Read More »మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన
ఆర్మూర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, భీమ్గల్, ఆర్మూర్‌లలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ భవనాలను జిల్లా ఇంచార్జి మంత్రి అయిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీతో కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, …
Read More »విద్యార్థులను పరామర్శించిన ఎల్‌ఎస్‌వో, ఏఐబిఎస్‌ఎస్ సంఘాల నాయకులు
ఆర్మూర్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్గల్ మండలంలోని కేజీబీవీ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను ఏఐబిఎస్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ నాయక్ మరియు ఎల్‌ఎస్‌వో జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలుషిత ఆహారం తిని 80 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని, అధికారుల నిర్లక్ష్యం వలనే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని …
Read More »భీంగల్ కెజిబివి తనిఖీ చేసిన మంత్రి
భీంగల్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలుషిత ఆహరంతో విద్యార్థినులు అస్వస్థకు గురైన భీంగల్ కస్తూరిబా గాంధీ (కెజిబివి) స్కూల్‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్ మరియు బాత్రూమ్‌లు విద్యార్థినుల తరగతి గదులు అన్ని కలియతిరిగి మంత్రి పరిశీలించారు. విద్యార్ధినిలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలు …
Read More »విశ్వకర్మ సంఘము నూతన కార్యవర్గం ఏర్పాటు
భీంగల్, మే 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అయ్యప్ప నగర్‌లో ఉన్న విశ్వకర్మ సంఘం – 2 నూతన కార్యవర్గాన్ని శుక్రవారం అమావాస్యని పురస్కరించుకొని పాత సంఘం భవన నిర్మాణంలో కొన్ని నూతన హంగులతో నిర్మాణం చేపట్టిన వాటి నిర్మాణం పూర్తి కావడంతో విశ్వకర్మ సంఘం సభ్యులు అందరూ కూడా పాతసంఘ భవనాన్ని మరియు నూతనంగా ఏర్పాటు చేసుకున్న షెడ్డు హల్‌ని …
Read More »బాధిత కుటుంబానికి మంత్రి ఆర్ధిక సహాయం
భీంగల్, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన కర్రోళ్ళ అనిల్ యాదవ్‌కు చెందిన 48 గొర్రెలు ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. పిడుగుపాటుకు అనిల్ కూడా గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాధిత అనిల్‌ను గురువారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న అనిల్‌కు అందుతున్న …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్
భీంగల్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన కర్రోల్ల సుమన్ ఇటీవల తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. సుమన్ 5 సంవత్సరాల క్రితం గల్ఫ్ వెళ్ళి పని దొరకక నష్టపోయి తిరిగి వచ్చి ఉన్న కొన్ని గొర్రెలను మేపుకొని జీవితం గడిపి కుటుంబాన్ని పోషించాడు. అప్పులు ఎక్కువ కావడంతో గొర్రెలను అమ్మేసి ఊరిలోనే వేరొకరి దగ్గర గొర్ల కాపరిగా …
Read More »రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ల మంజూరుకు కృషి
వేల్పూర్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్గ్ ల మంజూరు కోసం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా తనవంతు బాధ్యతను గుర్తెరిగి ఈ దిశగా కృషి చేశానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం భీంగల్, వేల్పూర్ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. నిజామాబాద్ శివారులోని మాధవనగర్ ఆర్.ఓ.బీ తో …
Read More »గ్రామాలన్ని తీర్మానించాలని మంత్రి ఆదేశాలు
భీంగల్, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.వందల కోట్ల నిధులను ఖర్చు చేస్తూ గ్రామ గ్రామాన నూతనంగా నిర్మిస్తున్న బీ.టీ రోడ్లను పది కాలాల పాటు మన్నికగా ఉండేలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. భీంగల్ మండలంలో అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ …
Read More »బాల్కొండ నియోజకవర్గానికి 5 బెడ్లతో కూడిన నూతన డయాలసిస్ సెంటర్
వేల్పూర్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో నివసించే కిడ్నీ బాధిత ప్రజలు డయాలసిస్ చేయించుకోవడానికి వెళ్లాలంటే వారు దూర ప్రయాణం చేసి నిజామాబాద్ లేదా హైదరాబాద్ హాస్పిటల్స్‌కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. వారు పడుతున్న ఇబ్బందులు గమనించిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన బాల్కొండ నియోజకవర్గ కిడ్నీ బాధిత ప్రజల కోసం భీంగల్ …
Read More »