Tag Archives: birkoor

అంగన్‌వాడి ఉద్యోగుల సమ్మెకు కాంగ్రెస్‌ మద్దతు

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బీర్కూరు మండల కేంద్రంలో బాన్సువాడ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అంగన్‌వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెకు సంఫీుభావం తెలిపారు. రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, డాక్టర్‌ అనిల్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ గౌడ్‌, దామరంచ ఛైర్మన్‌ కమలాకర్‌ రెడ్డి మాట్లాడుతూ గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న …

Read More »

రేపు దుర్కిలో చేప పిల్లల పంపిణీ

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలం దుర్కి పీర్ల చెరువులో ప్రభుత్వ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం రేపు అనగా బుధవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చేతుల మీదుగా నిర్వహింప బడుతున్నట్లు ఎంపిపి విఠల్‌ తెలిపారు. ఈ కార్య్రమానికి ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ …

Read More »

నసురుల్లాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం

నసురుల్లాబాద్‌ సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజలందరికీ 76వ తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పక్క రాష్ట్రాలయిన మహారాష్ట్ర కర్ణాటకలో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణా రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలవుతున్న తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించడం లేదు అని …

Read More »

బిజెపి అధికార ప్రతినిధిగా చందూరి హనుమాండ్లు

బీర్కూర్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిజెపి పార్టీ అధికార ప్రతినిధిగా నసురుల్లాబాద్‌ మండలానికి చెందిన చండూర్‌ హనుమాండ్లును బిజెపి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చందూరి హనుమాండ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా బాన్సువాడలో బిజెపి పార్టీని బలోపేతం చేసి బిజెపి నాయకుడిని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేస్తానని తన మీద …

Read More »

తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐ కొలువు

బీర్కూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని బీర్కూర్‌ మండల కేంద్రానికి చెందిన కీర్తి రాజ్‌ నిరూపించారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళితే పేదరికం అడ్డు రాదని నిరూపించి మొదటి ప్రయత్నంలోనే ఎస్సై ఉద్యోగాన్ని సాధించారు కీర్తి రాజ్‌. ప్రభుత్వం ఇటీవల కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగుల కోసం పరీక్షలు నిర్వహించగా ఎస్సై ఉద్యోగానికి పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే …

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన కాసుల రోహిత్‌

బాన్సువాడ, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన గుత్తి మల్లు కొండకు చెందిన నివాసపు ఇల్లు ఇటీవల భారీ వర్షాలకు కూలిపోవడంతో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకుడు కాసుల రోహిత్‌ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం వారిని పరామర్శించిన పాపాన …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభం

బీర్కూర్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దామరంచ సొసైటీ చైర్మన్‌ కమలాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీర్కూరు మండలంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభించి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎలమంచిలి శ్రీనివాసరావు, పిసిసి డెలిగేట్‌లు డాక్టర్‌ కూనిపూర్‌ రాజారెడ్డి, వెంకటరామరెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ప్రతాప్‌ సింగ్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాన్సువాడ …

Read More »

విలేఖరి బైక్‌ చోరి….

బీర్కూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్‌కుర్‌ గ్రామంలో ఒక పత్రిక విలేకరికి చెందిన ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం రాత్రి దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. సిసి ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా గత కొద్ది రోజులుగా మండలంలో పలు ద్విచక్ర వాహనాలు దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు గస్తీ నిర్వహించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Read More »

ఘనంగా బోనాల పండుగ

బీర్కూర్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పండుగ బోనాల పండుగ పురస్కరించుకొని బీరుకూరు మండల కేంద్రంలో గాండ్ల కులస్తులు బోనాల పండుగని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బోనాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు బాణ సంచాల మధ్యన ఊరేగింపుతో అమ్మవారి ఆలయానికి గాండ్ల కులస్తులు కుటుంబ సమేతంగా తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గాండ్ల కుల పెద్దలు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

Read More »

పాఠశాలకు ప్రింటర్‌ బహుకరించిన పూర్వ విద్యార్థులు

నసురుల్లాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1996 ` 97, 10వ తరగతి చదివిన విద్యార్థులు 25 సంవత్సరాల సందర్భంగా సిల్వర్‌ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దూర్కి ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు ప్రింటర్‌ బహుకరించారు. పాఠశాల సౌకర్యార్థం ఈ ప్రింటర్‌ మరియు కలర్‌ జిరాక్స్‌ ఎంతగానో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »