రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలకేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల లోని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని క్రీడా పోటీలను స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ ఎస్‌ఎంసి చైర్మన్ ఎం నాగరాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని వారు అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బలరాం, నాయకులు రఫిక్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్, ఉపాధ్యాయులు చిన్నప్ప, సంతోష్, …
Read More »పేదల పెన్నిధి సీఎం కేసీఆర్
రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల పెన్నిధి ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన జబ్బర్ ఖాన్‌కు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన రూ.36 వేలు, బి. సత్తెవ్వకు రూ.14 వేలు, మహ్మద్ ఉస్మాన్ కు రూ.11 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన …
Read More »బిజెపి అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం
రెంజల్, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని బోధన్ నిజం షుగర్ ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లు గడుస్తున్నా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేదని బిజెపి బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడ ప్రకాష్ ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం రెంజల్ మండలంలోని మౌలాలి తండా, తాడ్ బిలోలి, …
Read More »ఆర్మూర్‌లో క్రిస్టియన్ ఫంక్షన్ హాలుకు రూ.50 లక్షలు
ఆర్మూర్, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం సర్వమత సామరస్యానికి, సౌబ్రాతృత్వానికి ప్రతీక అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలో జీవన్ రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు నూతన దుస్తులను …
Read More »సిద్ధులగుట్టపై రూ.8 కోట్లతో బీటీ రోడ్డు
ఆర్మూర్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ సిద్ధులగుట్టపై రూ. 8 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి సోమవారం సాయంత్రం సిద్ధులగుట్టను సందర్శించి నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బీటీ రోడ్డు నిర్మాణం పనులను పరివేక్షించిన ఆయన సంబంధిత అధికారులకు …
Read More »సకల వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
ఆర్మూర్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని కులాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అండదండలు అందిస్తున్నదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్-మామిడిపల్లి శివారులో చేపట్టిన మేస్త్రీ మున్నూరు కాపు సంఘం భవనానికి సోమవారం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల …
Read More »