Tag Archives: Care degree college

కులమత రహిత సమాజం నిర్మించేది విద్యార్థియే

నిజామాబాద్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాల ఫేర్‌ వెల్‌ డే కార్యక్రమం అంగరంగా వైభవంగ న్యూ అంబేద్కర్‌ భవన్‌ ఆడిటోరియంలో జరిగింది. కళాశాల మొదటి మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చివరి సంవత్సరం విద్యార్థుల కొరకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసారు. నగరంలోని ప్రముఖ నృత్య దర్శకులు వినయ్‌ విద్యార్థులచే అద్భుతమైన నృత్యాలు చేయించారు. అదేవిధంగా ప్రముఖ కూచిపూడి …

Read More »

భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు అని విద్యావేత్త నరాల స్వప్న సుధాకర్‌ అన్నారు. స్థానిక కేర్‌ డిగ్రీ కళాశాలలో బుధవారం బతుకమ్మ సంబరాల వేడుకలను నిర్వహించారు. వేడుకలను విద్యావేత్త నరాల స్వప్న సుధాకర్‌ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులతో కలిసి బతుకమ్మను నరాల స్వప్న సుధాకర్‌ నెత్తిన ఎత్తుకొని ఊరేగించారు. అనంతరం మహిళల …

Read More »

బీసీ బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా సావెల్‌ నెల్ల లింగన్న

నిజామాబాద్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో జరిగిన బీసీ కులాల విస్తృత స్థాయి సమావేశంలో సావెల్‌ గ్రామానికి చెందిన నెల్ల లింగన్నను బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన లింగన్న గారు గతంలో గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షులుగా పని చేసిన అనుభవం ఉన్న నాయకులని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని …

Read More »

కేర్‌ కళాశాలలో ప్రాంగణ నియామకాలు

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 26వ తేదీ కేర్‌ డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ వారు ప్రాంగణ నియామకాలు చేపడుతున్నారని కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఐసిఐసిఐలో రిలేషన్షిప్‌ మేనేజర్‌ ఉద్యోగాల కొరకు కేర్‌ కళాశాలలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసారని తెలిపారు. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై, 25 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు బుధవారం ఉదయం 10 గంటల నుండి …

Read More »

కవిత్వమే సమాజానికి వసంత హేతువు

నిజామాబాద్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కవిత్వమే సమాజానికి వసంత హేతువు అని ప్రముఖ కవి సభా సామ్రాట్‌ విపి చందన్‌ రావు అన్నారు. శ్రీ శోభకృత్‌ నామ ఉగాది వేడుకలు మరియు 26వ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో ‘‘ వసంతాన్ని పిలుద్దాం రా’’ శీర్షికన కవి సమ్మేళనం …

Read More »

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో క్లీన్‌ ఇండియా కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబర్‌ 2 గాంధీ జయంతిన మొదలైన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి తిలక్‌ గార్డెన్‌లో, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్‌ను సేకరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ మాట్లాడుతూ మన అలవాట్లే మన భవిష్యత్‌ను మారుస్తాయని, దేశాన్ని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని, తెలిసో …

Read More »

సాహిత్యానికి వెన్నుదన్ను గన్ను కృష్ణమూర్తి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కవి గన్ను కృష్ణమూర్తి ఆధునిక భావాలు కలిగిన కవి అని, మినీ కవిత్వంలో, రామాయణ పరిశోధనలో నూతన పంథాను సృష్టించాడని హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్‌ నివాళి అర్పించారు. గురువారం సాయంత్రం కేర్‌ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి రామాయణ పరిశోధకులు వక్త, వ్యాఖ్యాత సౌజన్యమూర్తి …

Read More »

నిరుద్యోగ అభ్యర్థులకు సదవకాశం ‍‍- ‍‍నేడు జాబ్‌మేళా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 3వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్‌లోని కేర్‌ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా ఉంటుందని కళాశాల ఛైర్మన్‌ నరాల సుధాకర్‌ తెలిపారు. హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ కంపనీ ఇండియా లిమిటెడ్‌ వారు నిర్వహిస్తున్న మేళాలో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులకు ఉద్యోగావకాశం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగార్థులు నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, బాన్సువాడ, ఆర్మూర్‌, బోధన్‌, మెట్‌పల్లి …

Read More »

ప్రాంగణ నియామాకల్లో 9 మంది ఎంపిక

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ డిగ్రీ కళాశాలలో ముథూట్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ వారు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 9 మంది అబ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయని కేర్‌ డిగ్రీ కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ తెలిపారు. ఎన్నికైన అభ్యర్థులకు ఆన్రోల్‌ ఉద్యోగం వెంబడే ఇస్తామని ముత్తుట్‌ ఫైనాన్స్‌ రీజియనల్‌ మేనేజర్‌ కొండ ఉపేందర్‌ తెలిపారు. కార్యక్రమంలో కేర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బాలకృష్ణ, ప్రతినిధి కొయ్యాడ …

Read More »

పుస్తక పఠనం గొప్ప అభిరుచి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుస్తకాలు అందించే జ్ఞానం జీవితాన్ని గొప్పగా నడిపిస్తాయని, పుస్తక పఠనం ప్రపంచంలోనే అత్యంత మంచి అభిరుచి అని ప్రముఖ సమాజ సేవకుడు మంచాల జ్ఞానేందర్‌ గుప్తా అన్నారు. ఫిబ్రవరి 14 ప్రపంచ పుస్తక వితరణ దినోత్సవం సందర్భంగా హరిద రచయితల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »