Tag Archives: collector ajivgandhi hanmanthu

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ఆమోదంతో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ జనరంజక పాలనను అందిస్తోందని నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్‌ ఆర్‌.భూపతి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రగతికోసం అహరహం శ్రమిస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలుస్తూ ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్పల్లి మండలం పడకల్‌ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు …

Read More »

ప్రజా పాలన కళా యాత్రను విజయవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది పూర్తైన సందర్భంగా ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కళా యాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం డిసెంబర్‌ 07 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, మేజర్‌ …

Read More »

సకాలంలో రైతులకు బిల్లుల చెల్లింపులు జరగాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ జరిగిన వెంటనే ఆన్లైన్‌లో ఓపీఎంఎస్‌ వివరాలను నమోదు చేసేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలన్నారు. మాక్లూర్‌ మండలం ఒడ్డాట్‌పల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ మంగళవారం …

Read More »

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 90 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ అంకిత్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ …

Read More »

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-3 పరీక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నిర్వహించిన గ్రూప్‌-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించి పలు సూచనలు చేశారు. కాగా, …

Read More »

ప్రశాంతంగా గ్రూప్‌-3 పరీక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్‌-3 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఆదివారం ఉదయం జరిగిన మొదటి సెషన్‌ పరీక్షకు జిల్లాలో మొత్తం 19,941 మంది అభ్యర్థులకు గాను, 10,037 మంది హాజరు కాగా, 9904 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. ఉదయం సెషన్‌ లో 50.33 …

Read More »

పకడ్బందీగా కొనసాగుతున్న సర్వే

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్ధిక స్థితిగతుల విశ్లేషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లాలో మొత్తం 469988 నివాస గృహాలకు గాను శనివారం సాయంత్రం నాటికి 295436 ఇళ్లలో వివరాల సేకరణ జరిగిందని, 62.86 శాతం సర్వే పూర్తయ్యిందని …

Read More »

గ్రూప్‌-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఈ నెల 17, 18వ తేదీలలో జరుగనున్న గ్రూప్‌-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. 17న ఉదయం 10.00 గంటల నుండి మధ్యాన్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు …

Read More »

దైనందిన జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగంగా మల్చుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని అన్నారు. నిజామాబాద్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »