Tag Archives: collector dr.sharath

ఇందిరాగాంధీ స్టేడియంలో స్టాళ్ళ ఏర్పాటు…

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ సందర్శించారు. వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ, సఖి కేంద్రం, ఆరోగ్యం, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆయిల్‌ ఫామ్‌ పంట సాగుపై ఉద్యానవన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో …

Read More »

ప్రజా సేవకులుగా బాధ్యత నెరవేర్చాలి…

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సేవకులుగా గురుతర బాధ్యతలు నెరవేర్చాలని, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ జాతీయ పతాకావిష్కరణ గావించారు. అనంతరం ఆయన ఉద్యోగులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవకులుగా మన బాధ్యతలను మరిచిపోవద్దని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు …

Read More »

కామారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇలా…

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ గావిస్తారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని, ఉదయం 10.40 గంటలకు జిల్లా పురోగతిపై …

Read More »

ఇందిరాగాంధీ స్టేడియం పరిశీలన…

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సభావేదిక ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ పరిశీలించారు. పరేడ్‌ జరిగే ప్రదేశాన్ని సందర్శించారు. స్టాల్స్‌ ఏర్పాటు చేసే స్థలాలను పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే వేదికను, గ్యాలరీలను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఆర్‌డిఓ …

Read More »

ఉత్తమ హరిత పాఠశాలగా ఉప్పల్‌వాయి జడ్‌పిహెచ్‌ఎస్‌

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉప్పల్వాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల జిల్లాలో ఉత్తమ హరిత పాఠశాలగా మారిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం ఆయన ఉప్పల్వాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు భూమిని వితరణ చేసిన పర్వ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్‌ రెడ్డి చొరవతో ఆదర్శ హరిత పాఠశాలగా రూపుదిద్దుకుందని …

Read More »

పరిశ్రమల స్థాపనకు జిల్లా యంత్రాంగం సిద్ధం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నూతన పరిశ్రమల స్థాపనకు చాల అనువుగా ఉంటుందని, అన్ని రకాల వనరులు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ తెలిపారు. మంగళవారం కేరళ రాష్ట్రానికి చెందిన కిటెక్స్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ హరికిషన్‌ సింగ్‌ సోధి, జనరల్‌ మేనేజర్‌ సాజి కొరియన్‌ కలెక్టర్‌ చాంబర్లో తనను కలుసుకున్నప్పుడు వారితో ఆయన మాట్లాడారు. కామారెడ్డి జిల్లా నూతనంగా …

Read More »

రుణ లక్ష్యాలు సాధించిన వారికి సన్మానం…

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలు సాధించిన వారికి ఆగస్టు 15 రోజున సన్మానం చేస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఐకెపి అధికారులతో రుణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకు లింకేజీ రుణాలు ఆగస్టు 15 లోగా 55 శాతం లక్ష్యాలను పూర్తి చేసినవారికి సన్మానం చేయనున్నట్లు చెప్పారు. …

Read More »

భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య కేంద్రాల పనుల పురోగతిపై ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కోరారు. పనులు చేపట్టకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా …

Read More »

విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాయీ బ్రాహ్మణులకు, రజకులు ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. దోబీ ఘాట్‌, లాండ్రీ షాప్‌, సెలూన్‌ల కోసం విద్యుత్‌ కనెక్షన్‌ కావాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలని కోరారు. ఇప్పటివరకు ఆరు వందల ఇరవై నాలుగు మంది లబ్ధిదారులు …

Read More »

హైవేలో భూములు పోయిన రైతులకు పరిహారం అందించాలి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ హైవే 164 పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో సోమవారం జాతీయ రహదారి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైవేలో భూములు పోయిన రైతులకు పరిహారం అందించాలని సూచించారు. రోడ్డు వెడల్పు పనుల కోసం ఫారెస్ట్‌, నేషనల్‌ హైవే అధికారులు సంయుక్త …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »