కామరెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరు చదువుతో పాటు తమకిష్టమైన ఏదో ఒక క్రీడలో రాణించాలని, రోజులో కనీసం అరగంట వ్యాయామానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ యువతకు పిలుపునిచ్చారు. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చాంద్ 118 వ జయంతి సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ …
Read More »శ్రావణ్‌ను వరించిన షాప్ నెంబరు 48
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద ఎస్.హెచ్.ఓ. పరిధిలోని పిట్లం మండలం మద్దెల చెరువు షాప్ నెంబర్ 48 మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన లక్కీ డ్రా లో రంగు శ్రావణ్ కుమార్‌కు వరించింది. 2023-25 నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు గాను ఈ నెల 21 న లక్కీ డ్రా నిర్వహించగా 48 …
Read More »కామారెడ్డిలో హరితహారం భేష్… పలు సూచనలు…
కామరెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిక్కటి గ్రీనరీ తో జిల్లా పచ్చదనం సంతరించుకునేలా విరివిగా మొక్కల పెంపకం చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయం హరితహారం ఓ.ఎస్.డి. ప్రియాంక వర్గీస్ అధికారులకు సూచించారు. వాతావరణ సమతుల్యంతో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందించాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని, ఆ దిశగా జిల్లా అంతా పచ్చదనం సంతరించుకునేలా ఎక్కడా గ్యాప్ లేకుండా మొక్కలు నాటాలని అన్నారు. సోమవారం …
Read More »ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను పూర్తి చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు, లక్ష్యాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »ప్రజావాణిలో 93 వినతులు
కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన వినతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదీదారుల నుండి 93 వినతులు జెడ్పి సీఈఓ సాయ గౌడ్ తో కలిసి స్వీకరించారు. ఇందులో ప్రధానంగా భూ సమస్యలు,ధరణి, భూ తగాదాలకు …
Read More »ఓటు వజ్రాయుధం…
కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం లో భాగంగా ఆదివారం మాచారెడ్డి, పల్వంచ, భవాని పేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణ తీరుతెన్నులను, ఓటరు జాబితాలను పరిశీలించారు. …
Read More »మొక్కలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ సమతుల్యంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం అందించుటకు రాష్ర ప్రభుత్వం హరిత హారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టిందని, వాటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, మునిసిపల్ కమీషనర్ దేవేందర్ తో కలిసి …
Read More »పోలింగ్ బూత్‌ల ఆకస్మిక తనిఖీ
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి పట్టణంలోని మార్కెట్ కమిటీ, గంజిలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని వివిధ పోలింగు బూతులను సందర్శించారు. 203 నుంచి 208 వరకు, 220,221 పోలింగ్ బూతులతో ఉన్న బి.ఎల్.ఓ. లతో ఉన్న ఓటరు ముసాయిదా ప్రతులను, ఓటరు నమోదు పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »పురోగతిలో ఉన్న పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్ బీబీపాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో మాట్లాడారు. పంచాయత్ రాజ్, రోడ్లు భవనాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న …
Read More »వాల్టా చట్టం పకడ్బందీగా అమలు చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. భూగర్భ జలాల త్రవ్వకాలు, నియంత్రణకు 2002 లో ఏర్పాటు చేసిన చట్టాన్ని మరింత బలోపేతం చేసి సమర్థవంతంగా చట్టాన్ని అమలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జి.ఓ. 15 విడుదల చేసిందని కలెక్టర్ తెలిపారు. ఇట్టి …
Read More »