కామారెడ్డి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని సందీపని జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కంటి వెలుగు కేంద్రంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా అందజేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి చంద్రశేఖర్, కౌన్సిలర్ వనిత, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Read More »బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి
కామారెడ్డి, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఓటర్ల జాబితాలలో మృతి వారి పేర్లు తొలగింపు పై రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వారిగా మృతి చెందిన వారి పేర్లను తొలగించాలని …
Read More »ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశం
కామారెడ్డి, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోల ప్రక్రియ సజావుగా సాగే విధంగా చూడాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అధికారులతో పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పాలని అధికారులకు సూచించారు. తడిచిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు పంపించే విధంగా అధికారులు చర్యలు …
Read More »ఈవిఎం గోదామును పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కేంద్రాల్లో ఉన్న ఈవీఎంల, వివి ప్యాడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకుడు సాయిబుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం
కామారెడ్డి, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బాన్సువాడ నియోజకవర్గం మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవాలని తెలిపారు. తడిసిన ధాన్యం ను తీసుకోకపోతే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. లక్ష్యానికి అనుకూలంగా మిల్లింగ్ చేయాలని …
Read More »విద్యుత్తు పొదుపుతో ఆర్థికంగా బలపడాలి
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యుత్తును పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం విద్యుత్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యుత్తును అదా చేయుటకు వినియోగదారులు పాటించవలసిన సూచనలు విద్యుత్ అధికారులు అవగాహన సదస్సుల ద్వారా తెలియజేయాలని తెలిపారు. నేటి విద్యుత్ అదా రేపటి విద్యుత్తు …
Read More »బాల్యవివాహాలను రూపుమాపాలి
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్యవివాహాలను రూపుమాపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం బాల రక్షా భవన్ కన్వర్డేషన్ మీటింగ్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. (గ్రామాల్లో ఉన్న అనాధ పిల్లల వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు సేకరించాలని సూచించారు. అనాధ పిల్లలకు (ధ్రువీకరణ పత్రం వచ్చిందా లేదా …
Read More »పంట నష్టం వివరాలు సేకరించాలి
కామారెడ్డి, మే 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :వడగళ్ల వానతో పంట నష్టం జరిగిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో పంట నష్టం వివరాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పంట నష్టం వివరాలను సేకరించాలని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్లో …
Read More »దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, మే 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సోమవారం అకాల వర్షంతో దెబ్బతిన్న వరి పంటను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని సూచించారు. నష్టపోయిన రైతుల వివరాలు డాటా ఎంట్రీ చేయించాలని తెలిపారు.
Read More »పనిలో మెళకువ, నైపుణ్యంతో మంచి భవిష్యత్తు
కామారెడ్డి, మే 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :చేసే పనిలో మేలకులు, నైపుణ్యాలు నేర్చుకుంటే కార్మికులకు మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బాలుర పాఠశాలలో సోమవారం జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. …
Read More »