కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లోక్ అదాలత్ ద్వారా ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కామారెడ్డి జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కోర్టులో బుధవారం జాతీయ లోక్ అదాలత్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సంవత్సరాల తరబడి వివాదంలో ఉన్న రెవెన్యూ , కుటుంబ సమస్యలకు లోక్ అదాలత్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. …
Read More »ఓటు వజ్రాయుధం
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు వజ్రాయుధం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఓటు చాలా పవిత్రమైందని తెలిపారు. దానిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నిజాయితీగల అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. 18 …
Read More »అచ్చంపేటలో కంటివెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
నిజాంసాగర్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఈ శిబిరం ద్వారా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంత మందికి కంటి …
Read More »ప్రయివేటు వాహనాలు నిలుపకుండా తనిఖీలు చేపట్టాలి
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బస్టాండ్ సమీపంలో ప్రైవేటు వాహనాలు నిలుపకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఆర్టీసీ, ఆర్టీవో, పోలీస్ అధికారులతో ఆర్టీసీ ఆదాయం పెంపుపై సమీక్ష నిర్వహించారు. ప్రతి సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 …
Read More »ఉత్తమ అధికారుల వివరాలు అందజేయాలి
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :ఉత్తమ అధికారులను ఎంపిక చేసి శాఖల వారీగా వారి పేర్లను పర్యవేక్షకుడు సాయి భుజంగరావుకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజా ప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందే విధంగా అధికారులు చూడాలని …
Read More »పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కలెక్టర్లకు అభినందనలు
కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు శిబిరాలను ప్రతిరోజు పర్యవేక్షించి శిబిరాలలో సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై …
Read More »సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకొని లబ్దిపొందాలి
కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ఐకెపి అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాల వసూళ్లు, సోలార్ వినియోగం పై సమీక్ష …
Read More »కంటి వెలుగు శిబిరాలను సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రాన్ని అంధత్వ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉన్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. ఏర్పాటుచేసిన కౌంటర్లను పరిశీలించారు. ఎంతమందికి ఇప్పటివరకు స్క్రీనింగ్ చేశారని వివరాలు అడిగారు. రీడిరగ్ అద్దాలను ఎంతమందికి అందజేశారని …
Read More »15 రోజుల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి
కామరెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితా లో ఉన్న పి.ఎస్.ఈ ఎంట్రీలు వంద శాతం ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్‌తో కలిసి …
Read More »మాస్టర్ ప్లాన్ ప్రక్రియ నిలిపివేత
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రక్రియను నిలిపివేస్తామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్ లతో మాస్టర్ ప్లాన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. రైతుల, ప్రజల నుంచి …
Read More »