కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మూడవ రోజైన ఆదివారం 18వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని కళాభారతిలో సాంస్క్రతిక ప్రదర్శనలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలోని జానపద కళాకారులు, కవులు, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సాంస్కృతిక ప్రదర్శనలు విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ …
Read More »మాత్రలు వేసి పురుగులు రాకుండా నియంత్రించవచ్చు
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు మాత్రలు వేసి నులిపురుగులు రాకుండా సులభంగా నియంత్రించవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గంజ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా గురువారం మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.0-19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు తప్పనిసరిగా నివారణ మాత్రలు …
Read More »ఆదివాసి గిరిజన సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17న హైదరాబాదులో నిర్వహించే ఆదివాసీ గిరిజన సమ్మేళనం కార్యక్రమం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17న హైదరాబాదులో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొమరం భీమ్ ఆదివాసీ భవనం, సేవాలాల్ బంజారా భవనాన్ని ప్రారంభిస్తారని, సదరు కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రత్యేకించిన బస్సులలో ఎస్టీ …
Read More »వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు రోజులపాటు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సి ఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సులో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. ఈనెల 16, 17,18 తేదీలలో ఉత్సవాలను జరపాలని సూచించారు. 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులు, మహిళలతో ర్యాలీలో నిర్వహించాలని పేర్కొన్నారు. 17న జిల్లా కేంద్రాల్లో …
Read More »ఈవిఎం కేంద్ర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కేంద్రం తాళాలను చూశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఎన్నికల అధికారి సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం టేక్రియాల్‌లో ఉన్న అటవీ శాఖ నర్సరీని పరిశీలించారు. వారం రోజుల వ్యవధిలో మొక్కలను ఖాళీ …
Read More »కామారెడ్డిలో త్వరలో వ్యాయామ జిమ్
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :అక్టోబర్ మొదటి వారంలో జిమ్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలను పరిశీలించారు. జిమ్ కోసం అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలని జిల్లా యువజన సర్వీసుల, క్రీడల అధికారి దామోదర్ రెడ్డికి సూచించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిమ్ కేంద్రం ఏర్పాటు కోసం …
Read More »343 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలుపై అధికారులకు సమీక్ష నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ధాన్యం శుభ్రం చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. శుభ్రం చేసిన నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. …
Read More »సాఫ్ట్‌వేర్ రంగంలో మెగా ఉద్యోగ మేళా
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కొరకు ఎంపిసి / ఎంఇసి 60శాతం మాథ్స్ సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత పొందిన ఇంటర్మీడియట్ 2021- 22 లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20న బాన్సువాడలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో …
Read More »అంతర్జాతీయ క్రికెట్‌కు కామారెడ్డి విద్యార్థి
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన క్రీడాకారుడు మహమ్మద్ ఇస్తాయక్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానించారు. ఈనెల 28,29,30 తేదీల్లో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ పోటీలు జరుగుతాయని చెప్పారు. మహ్మద్ ఇస్తాయక్ మంజీరా కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మంజీరా కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, శ్రీ ఆర్యభట్ట ప్రిన్సిపల్ హనుమంతరావు, …
Read More »సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయులు సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్‌లో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు నిరంతరం శ్రద్ధ పెట్టి …
Read More »