Tag Archives: collector jitesh v.patil

బాల్య వివాహాల నిర్మూలనకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్యవివాహాలు జరగకుండా గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి అధికారులతో బాల్య వివాహాల నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతినెల చివరి రోజున బాల్యవివాహాల నిర్మూలన, బడి మానేసిన పిల్లలపై గ్రామస్థాయిలో అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని …

Read More »

అత్యధిక అవార్డులు సాధించేలా చూడాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అత్యధిక పంచాయతీ అవార్డులను కామారెడ్డి జిల్లా సాధించే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆన్లైన్‌ పోర్టల్‌లో ఈనెల 10వ తేదీ నుంచి గ్రామపంచాయతీలు అవార్డుల కోసం తప్పులు లేకుండా …

Read More »

భావితరాలకు మేధావులను అందించేంది ఉపాధ్యాయులే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బావితరాలకు మేధావులను అందించడం ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం 50 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని చెప్పారు. సమాజ ఎదుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని …

Read More »

15న నట్టల నివారణ మందుల పంపిణీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15న జాతీయ నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లులోని కాన్ఫరెన్స్‌ హాల్లో టాస్క్ఫోర్స్‌ సమావేశంలో మాట్లాడారు. ఈనెల 12న మండల స్థాయిలో నట్టాల నివారణ మందుల పంపిణీపై టాస్క్‌ఫోర్స్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నట్టల నివారణ …

Read More »

అంకితభావంతో పనిచేసిన వారు మన్ననలు పొందుతారు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందుతారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో పదోన్నతి పై వెళ్లిన జిల్లా పశువైద్యాధికారి జగన్నాథచారికి సన్మాన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడిఎ జగన్నాథ చారికి జిల్లా కలెక్టర్‌, జిల్లా అధికారులు సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ భరత్‌, దేవేందర్‌, పశు …

Read More »

ఆధునిక పద్ధతులు ఉపయోగించి దిగుబడులు పెంచుకోవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధునిక పద్ధతులు ఉపయోగించి పాల దిగుబడిలను పెంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్లు జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మేలు జాతి పశుసంతతిని పెంపొందించుకొని పాల ఉత్పత్తిని పెంచాలని సూచించారు. హైబ్రిడ్‌ పశుగ్రాసాలను సాగుచేసి పశువులకు పచ్చిమేతను అందించాలని కోరారు. స్త్రీనిధి రుణాల ద్వారా …

Read More »

కామారెడ్డిలో గణేష్‌ ఉత్సవాలు

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్లో జనహిత గణేష్‌ మండలి ఆధ్వర్యంలో గణేష్‌ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా గణేష్‌ విగ్రహానికి బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ దంపతులు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు అన్ని వర్గాల ప్రజలు ఘనంగా …

Read More »

మట్టి గణపతులు పంపిణీ చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ రేట్లు మంగళవారం మట్టి గణపతులను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పంపిణీ చేశారు. మట్టి గణపతులను పెట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతోందని సూచించారు. తొమ్మిది రోజులపాటు మట్టి గణపతులకు పూజలు చేయాలని సూచించారు. ఉద్యోగులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఓ రాజారాం, ఏవో రవీందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read More »

తేనెటీగల పెంపకంతో ఉపాధి

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలోని రాశి వనంలో ఉన్న తేనెటీగల బాక్సులను ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. తేనెటీగల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. తేనెటీగల పెంపకం ద్వారా విద్యార్థులకు స్వయం ఉపాధి లభిస్తుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Read More »

పరీక్ష కేంద్రాల తనిఖీ

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కానిస్టేబుల్‌ రాత పరీక్ష కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో ఉన్న వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్యను అధికారులను అడిగారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు ఏఎస్‌పి అన్యోన్య, చంద్రకాంత్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »